ఓటేయడం మరచిన అభ్యర్థి
ABN , Publish Date - Nov 06 , 2026 | 06:34 AM
చిత్తూరు జిల్లా కుప్పం మండలంపైపాళ్యం ఎంపీటీసీ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా బేట్రాయన్ పోటీ చేశారు. పోలింగ్ హడావుడిలో ఎంపీటీసీ అభ్యర్థి ఓటేయడం మరచిపోయారు.
పోలింగ్ హడావుడిలో ఎంపీటీసీ అభ్యర్థి ఓటేయడం మరచిపోయారు. చిత్తూరు జిల్లా కుప్పం మండలంపైపాళ్యం ఎంపీటీసీ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా బేట్రాయన్ పోటీ చేశారు. రోజంతా పోలింగ్ కేంద్రం లోపలికి, వెలుపలకు తిరుగుతూ బేట్రాయన్ హడావుడిగా గడిపారు. ఈ హడావుడిలో ఓటు వేయడం మరచిపోయారు. తీరా గుర్తొచ్చి.. ఆత్రంగా పోలింగ్ బూత్‌లోకి వెళ్లేసరికి సమయం మించిపోయిందంటూ ఓటేయానికి అధికారులు అంగీకరించలేదు.
- కుప్పం