Share News

హైకోర్టు ఉత్తర్వులను సరైన స్ఫూర్తితో అమలు చేశారా.. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ధర్మాసనం

ABN , Publish Date - Mar 16 , 2026 | 09:02 PM

గ్రూప్ -1 ప్రధాన పరీక్షల్లో ఉద్యోగాలకు ఎంపికైన వారిని ఫోకల్ నుంచి నాన్ ఫోకల్ పోస్ట్‌లకు మార్చాలని తాము ఇచ్చిన ఉత్తర్వులపై హైకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. హైకోర్టు ఉత్తర్వులు సరైన స్పూర్తితో అమలు చేశారా లేదా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

హైకోర్టు ఉత్తర్వులను సరైన స్ఫూర్తితో అమలు చేశారా.. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ధర్మాసనం
AP High Court news

గ్రూప్ -1 ప్రధాన పరీక్షల్లో ఉద్యోగాలకు ఎంపికైన వారిని ఫోకల్ నుంచి నాన్ ఫోకల్ పోస్ట్‌లకు మార్చాలని తాము ఇచ్చిన ఉత్తర్వులపై హైకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. హైకోర్టు ఉత్తర్వులు సరైన స్ఫూర్తితో అమలు చేశారా లేదా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఆర్డీఓలు, డీఎస్పీలుగా పనిచేస్తున్న వారిని బదిలీ చేయాలని ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ, డీజీపీ మౌఖిక ఆదేశాలకు అనుగుణంగా డీఎస్పీలు పాత స్థానాల్లోనే కొనసాగుతున్నారని వచ్చిన కథనాల గురించి ప్రశ్నించింది (High Court orders implementation).


పత్రికా కథనంలో ఉన్న వివరాలు నిజమేనా అని అడ్వకేట్ జనరల్‌ను హైకోర్టు ప్రశ్నించింది. ఉద్యోగులను నాన్ ఫోకల్ పోస్ట్‌లకు మార్చాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు కూడా సమర్థించిందని ధర్మాసనం గుర్తు చేసింది. పత్రికా కథనం నిజమే అయితే హైకోర్టు, సుప్రీంకోర్టు ఉత్తర్వులను అగౌరవ పరిచేనట్లేనని వ్యాఖ్యానించింది. నివేదిక దాఖలు చేసేందుకు మరింత సమయం కోరుతూ సిట్ వేసిన పిటిషన్‌పై హైకోర్టు మండిపడింది. ఏ కారణాలతో సమయం కోరుతున్నారో చెప్పకుండా పొడిగింపు ఉత్తర్వులు ఎలా జారీ చేస్తామని ప్రశ్నించింది (AP Group-1).


దర్యాఫ్తులో సిట్ పూర్తి బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందని, ఇది చాలా దురదృష్టకరమని హైకోర్టు వ్యాఖ్యానించింది (AP High Court news). హైకోర్టు ఆదేశాల మేరకు సీఎస్, సిట్ నడుచుకోవడం లేదని, ఈ నేపథ్యంలో సిట్ దర్యాప్తు సక్రమంగా సాగుతుందని ఎలా విశ్వసించగలమని హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.


ఇవి కూడా చదవండి..

ఆటో డ్రైవర్ అని తేలిగ్గా చూడకండి.. ఇతడు ఒక్క రోజులో ఎంత సంపాదిస్తాడో తెలిస్తే..


మీవి డేగ కళ్లు అయితే.. ఈ ఫొటోలో జింక ఎక్కడ దాక్కుందో 5 సెకెన్లలో కనిపెట్టండి..

Updated Date - Mar 16 , 2026 | 09:13 PM