Share News

అబద్ధాలు చెప్పడం వైసీపీ నేతలకు అలవాటే: అచ్చెన్న

ABN , Publish Date - Apr 26 , 2026 | 05:08 AM

‘ఐదేళ్ల వైసీపీ పాలనలో రైతులు అప్పుల పాలయ్యారు. దానిని మరచి, రైతుకు వెన్నుదన్నుగా నిలిచిన కూటమి ప్రభుత్వంపై అబద్ధాలు ప్రచారం చేయడం వైసీపీ నేతలకు ఆలవాటుగా మారింది’ అని మంత్రి అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు.

అబద్ధాలు చెప్పడం వైసీపీ నేతలకు అలవాటే: అచ్చెన్న

అమరావతి, ఏప్రిల్‌ 25(ఆంధ్రజ్యోతి): ‘ఐదేళ్ల వైసీపీ పాలనలో రైతులు అప్పుల పాలయ్యారు. దానిని మరచి, రైతుకు వెన్నుదన్నుగా నిలిచిన కూటమి ప్రభుత్వంపై అబద్ధాలు ప్రచారం చేయడం వైసీపీ నేతలకు ఆలవాటుగా మారింది’ అని మంత్రి అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. ఈమేరకు మంత్రి అచ్చెన్న శనివారం ఓ ప్రకటన చేశారు. ‘వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ప్రజల్ని మభ్యపెట్టేలా పూర్తి అబద్ధాలు ఆడుతున్నారు. కూటమి పాలనలో రైతులకు సమయానికి విత్తనాలు, ఎరువులు, సాగునీరు అందిస్తూ, పంటలకు గిట్టుబాటు ధరలు కల్పిస్తూ, వ్యవసాయాన్ని బలోపేతం చేస్తున్నాం. ఎమ్మెస్పీ అమలుకు ధరల స్థిరీకరణ నిధి ద్వారా రైతుల్ని అన్ని విధాలా ఆదుకుంటున్నాం. 2025-26లో పంట ఉత్పత్తుల కొనుగోలుకు రూ.300 కోట్లు కేటాయించి, రూ.588 కోట్లు ఖర్చు చేశాం. వైసీపీ హయాంలో ధరల స్థిరీకరణ నిధి ఖర్చు చేయకుండా రైతుల్ని మోసం చేశారు. వాస్తవాలు తెలుసుకోకుండా వైసీపీ నేతలు అబద్ధాలు ప్రచారం చేస్తే, ప్రజలు తిప్పికొడతారు’ అని మంత్రి అచ్చెన్న స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఏ పంటకు, ఎన్ని రూ.కోట్లు మద్దతు రూపంలో అందించిందీ ఆయన వివరించారు. మొక్కజొన్న సమస్యపై కేంద్ర మంత్రి చౌహాన్‌తో చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు.

Updated Date - Apr 26 , 2026 | 05:10 AM