Share News

అల్లూరి జిల్లాలో దారుణం.. వ్యక్తిపై నాటు తుపాకితో కాల్పులు..

ABN , Publish Date - Apr 18 , 2026 | 06:17 PM

భూతగాదా నేపథ్యంలో ఓ వ్యక్తి ఘాతుకానికి ఒడిగట్టాడు. బంధువుపై నాటు తుపాకితో కాల్పులు జరిపాడు. తీవ్రగాయాలపాలైన బంధువు పరిస్థితి విషమంగా ఉంది.

అల్లూరి జిల్లాలో దారుణం..  వ్యక్తిపై నాటు తుపాకితో కాల్పులు..
Araku Valley shooting

ఇంటర్‌నెట్ డెస్క్: అల్లూరి జిల్లాలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. భూతగాదా నేపథ్యంలో ఓ వ్యక్తి ఘాతుకానికి ఒడిగట్టాడు. బంధువుపై నాటు తుపాకితో కాల్పులు జరిపాడు. తీవ్రగాయాలపాలైన బంధువు పరిస్థితి విషమంగా ఉంది. సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళితే.. డుంబ్రిగూడ మండలం, పోతంగి పంచాయతీకి చెందిన కిల్లో బిమల, కిల్లో లక్ష్మణరావు మధ్య గత కొంత కాలంగా భూతగాదాలు నడుస్తున్నాయి. శనివారం కూడా ఇద్దరి మధ్యా గొడవ జరిగింది.


గొడవ చిలికిచిలికి గాలివానలా మారింది. లక్ష్మణ రావు ఆగ్రహంతో ఊగిపోయాడు. తన దగ్గర ఉన్న నాటు తుపాకితో బిమలపై కాల్పులు జరిపాడు. నాటు తుపాకి దాడిలో బిమల తీవ్రంగా గాయపడ్డారు. బిమలను కుటుంబసభ్యులు అరకులోయ ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో విశాఖ కేజీహెచ్‌కు తరలించాలని అక్కడి వైద్యులు సూచించారు. దీంతో బిమలను కేజీహెచ్‌కు తరలించారు. ఇక, ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.


ఇవి కూడా చదవండి

అనకాపల్లిలో కూలిన ఫుట్ఓవర్ బ్రిడ్జ్.. ఇద్దరికి గాయాలు

మరికాసేపట్లో ఎస్ఆర్‌హెచ్‌తో చెన్నై మ్యాచ్ .. స్టార్ బౌలర్ దూరం

Updated Date - Apr 18 , 2026 | 06:25 PM