పేలిన ఏఆర్ కానిస్టేబుల్ తుపాకీ
ABN , Publish Date - Oct 07 , 2026 | 04:53 AM
రక్షణ శాఖ మంత్రి రాజనాథ్‌సింగ్ విశాఖ పర్యటనలో భాగంగా బందోబస్తు విధులు నిర్వర్తిస్తున్న ఏఆర్ కానిస్టేబుల్ కొండబాబు చేతిలో ఉన్న తుపాకీ మంగళవారం మధ్యాహ్నం ఒక్కసారిగా పేలింది.
రక్షణ మంత్రి బందోబస్తులో ఉండగా ఘటన
విశాఖపట్నం(మల్కాపురం), అక్టోబరు 6(ఆంధ్రజ్యోతి): రక్షణ శాఖ మంత్రి రాజనాథ్‌సింగ్ విశాఖ పర్యటనలో భాగంగా బందోబస్తు విధులు నిర్వర్తిస్తున్న ఏఆర్ కానిస్టేబుల్ కొండబాబు చేతిలో ఉన్న తుపాకీ మంగళవారం మధ్యాహ్నం ఒక్కసారిగా పేలింది. బుల్లెట్ అతని ఛాతీ భాగంలోకి దూసుకుపోవడంతో తీవ్ర రక్తస్రావమైంది. అధికారులు వెంటనే అతన్ని గాజువాకలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఉన్నతాధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
ఈ వార్తలనూ చదవండి..
అమరావతి పనుల్లో వేగం పెంచాలి.. ప్రతి నెల రూ. 2వేల కోట్ల పనులు పూర్తి చేయాలి: సీఎం
స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పోటీ చేసే స్థానాలు ఖరారు..!