స్వచ్ఛ రథానికి జనం జై!
ABN , Publish Date - Oct 09 , 2026 | 04:45 AM
గ్రామీణ ప్రాంతాల్లో పారిశుధ్య నిర్వహణలో భాగంగా చేపడుతున్న ‘స్వచ్ఛ రథం’ కార్యక్రమం మంచి ఫలితాలను సాధిస్తోంది. సెప్టెంబరులో రాష్ట్రవ్యాప్తంగా వివిధ మండలాల్లో 34,83,996 కిలోల పొడిచెత్తను సేకరించారు.
సెప్టెంబరులో రాష్ట్రవ్యాప్తంగా 34 లక్షల కిలోల పొడిచెత్త సేకరణ
అమరావతి, అక్టోబరు 8(ఆంధ్రజ్యోతి): గ్రామీణ ప్రాంతాల్లో పారిశుధ్య నిర్వహణలో భాగంగా చేపడుతున్న ‘స్వచ్ఛ రథం’ కార్యక్రమం మంచి ఫలితాలను సాధిస్తోంది. సెప్టెంబరులో రాష్ట్రవ్యాప్తంగా వివిధ మండలాల్లో 34,83,996 కిలోల పొడిచెత్తను సేకరించారు. ఈ వ్యర్థాల విలువ రూ.4,70,02,371గా నమోదైంది. ’ఈ రోజు పొడి చెత్త ఇవ్వండి.. రేపటి పరిశుభ్రమైన గ్రామాన్ని నిర్మించండి’ అనే సందేశంతో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. కర్నూలు జిల్లాలోని పెద్దకడబూరు మండలంలో పలమార్లు భారీగా పొడి చెత్త సేకరణ నమోదు కాగా, కృష్ణా జిల్లాలోని బాపులపాడు మండలంలోనూ స్వచ్ఛరథం ద్వారా గణనీయమైన స్థాయిలో సేకరణ జరిగింది. ప్లాస్టిక్ వ్యర్థాలను స్వచ్ఛ రథం వద్దకు తీసుకొస్తే.. కిలోల లెక్కన లెక్కించి, వాటికి సమాన విలువ కలిగిన నిత్యావసర వస్తువులు అందజేస్తుండటంతో గ్రామాల్లో ఈ కార్యక్రమానికి ఆదరణ పెరిగింది.
ఈ వార్తలనూ చదవండి:
ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ.. చర్చించిన కీలక అంశాలివే..
డిజిటల్ కరెన్సీని మోదీ ప్రోత్సహించారు