స్పెషల్ టెట్‌పై పిల్‌తో లాభమేంటో..?: ఎస్టీయూ
ABN , Publish Date - Nov 13 , 2026 | 04:50 AM
రాష్ట్ర ప్రభుత్వం ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయులకు ప్రత్యేకంగా నిర్వహిస్తున్న స్పెషల్ టెట్‌పై న్యాయస్థానాలను ఆశ్రయించి, ఉపాధ్యాయులను భయాందోళనలకు గురిచేయవద్దని రాష్ట్రోపాధ్యాయ సంఘం(ఎస్టీయూ) కోరింది.
అమరావతి, నవంబరు 12(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయులకు ప్రత్యేకంగా నిర్వహిస్తున్న స్పెషల్ టెట్‌పై న్యాయస్థానాలను ఆశ్రయించి, ఉపాధ్యాయులను భయాందోళనలకు గురిచేయవద్దని రాష్ట్రోపాధ్యాయ సంఘం(ఎస్టీయూ) కోరింది.
స్పెషల్ టెట్‌పై కొందరు ప్రజా ప్రయోజన వ్యాజ్యాల పేరుతో కోర్టులకు వెళ్లడాన్ని ఖండించింది. ఇలాంటి వ్యాజ్యాల వల్ల ప్రయోజనం ఏమిటో సంబంధిత వ్యక్తులు వెల్లడించాలని ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం.రఘునాథరెడ్డి, ఎల్.సాయిశ్రీనివాస్ గురువారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుల ప్రయోజనాలకు విఘాతం కలిగించే ఇలాంటి చర్యలను ఎస్టీయూ సహించదన్నారు.