తుది అంకానికి ‘సర్ విచారణ’
ABN , Publish Date - Sep 24 , 2026 | 04:18 AM
రాష్ట్రంలో సర్ ప్రక్రియ తుది అంకానికి చేరుకుంది. ఎన్యుమరేషన్ పత్రాల్లో లోపాలున్న ఓటర్లకు ముసాయిదా జాబితా విడుదల అనంతరం 44,28,844 మంది ఓటర్లకు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.
మొత్తం 44.28 లక్షల నోటీసులు
44 లక్షలకుపైగా విచారణ పూర్తి
41 లక్షల ఓటర్లు అర్హులని నిర్ధారణ
1.53 లక్షల ఓటర్లను అన ర్హులుగా తేల్చిన ఈసీ
అమరావతి, సెప్టెంబరు 23(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో సర్ ప్రక్రియ తుది అంకానికి చేరుకుంది. ఎన్యుమరేషన్ పత్రాల్లో లోపాలున్న ఓటర్లకు ముసాయిదా జాబితా విడుదల అనంతరం 44,28,844 మంది ఓటర్లకు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. బుధవారం నాటికి 44,00,225 మంది విచారణ పూర్తయింది. వారిలో 41,00,002 మంది తగిన పత్రాలు సమర్పించడంతో తుది ఓటర్ల జాబితాలో కొనసాగించేందుకు నిర్ణయించా రు. 1,53,600 మంది ఓటర్లు సరైన వివరాలు సమర్పించలేదు. దీంతో వారు తుది ఓటర్ల జాబితాలో చేరడానికి అనర్హులుగా గుర్తించారు.