రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్లకు ఘన సత్కారం
ABN , Publish Date - Sep 29 , 2026 | 05:36 AM
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి దోహదపడేలా శ్రీశైలం, నాగార్జునసాగర్, తుంగభధ్ర జలాశయాల నిర్మాణాల్లో కీలక పాత్ర పోషించిన అలనాటి ఇంజనీర్లను ఆంధ్రప్రదేశ్ జల వనరుల శాఖ రిటైర్డ్ ఇంజనీర్ల అసోసియేషన్ సన్మానించుకుంది.
అమరావతి, సెప్టెంబరు 28(ఆంధ్రజ్యోతి): ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి దోహదపడేలా శ్రీశైలం, నాగార్జునసాగర్, తుంగభధ్ర జలాశయాల నిర్మాణాల్లో కీలక పాత్ర పోషించిన అలనాటి ఇంజనీర్లను ఆంధ్రప్రదేశ్ జల వనరుల శాఖ రిటైర్డ్ ఇంజనీర్ల అసోసియేషన్ సన్మానించుకుంది. సోమవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తుంగభద్ర నిర్మాణంలో విశేష సేవలందించిన 92 ఏళ్ల రిటైర్డ్ సీనియర్ ఇంజనీరు సుందరంను అసోసియేషన్ ఘనంగా సత్కరించింది. శ్రీశైలం జలాశయ నిర్మాణంలో భాగస్వామిగా ఉన్న 91 ఏళ్ల రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్లు కృష్ణారావు, రంగరాజన్, రామచంద్రరాజు, ప్రభాకరరావులను ఏపీ జల వనరుల శాఖ సన్మానించింది.
ఈ వార్తలనూ చదవండి...
పింఛనుదారులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 1న ఉదయం 6:30 నుంచే పింఛన్ల పంపిణీ
పీఎం కిసాన్ 24వ విడత.. రైతులు ఈ 3 పనులు పూర్తి చేయాల్సిందే..