Share News

ఈ ఏడాది 10 కోట్ల మొక్కలు సిద్ధం

ABN , Publish Date - Oct 07 , 2026 | 04:39 AM

రాష్ట్రాన్ని 2047 నాటికి 50శాతం గ్రీన్‌ కవర్‌తో తీర్చిదిద్దడానికి సమగ్ర కార్యాచరణ ప్రణాళిక అమలుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఏపీ గ్రీన్‌ కమిటీ ఎగ్జిక్యూటివ్‌ చైర్మ న్‌, ఎమ్మెల్సీ కె.నాగబాబు చెప్పారు.

ఈ ఏడాది 10 కోట్ల మొక్కలు సిద్ధం

  • 500 మండలాల్లో 500 నర్సరీలకు స్థలాలు: నాగబాబు

అమరావతి, అక్టోబరు 6(ఆంధ్రజ్యోతి): రాష్ట్రాన్ని 2047 నాటికి 50శాతం గ్రీన్‌ కవర్‌తో తీర్చిదిద్దడానికి సమగ్ర కార్యాచరణ ప్రణాళిక అమలుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఏపీ గ్రీన్‌ కమిటీ ఎగ్జిక్యూటివ్‌ చైర్మ న్‌, ఎమ్మెల్సీ కె.నాగబాబు చెప్పారు. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు పంచాయతీరాజ్‌, మున్సిపల్‌, ఆర్‌అండ్‌బీ, పరిశ్రమలు, ఇతర శాఖలు, స్థానిక సంస్థలు సమన్వయంతో పనిచేయడంతోపాటు స్వచ్ఛంద సం స్థలు, విద్యార్థుల భాగస్వామ్యాన్ని విస్తృతం చేయాలన్నారు. మంగళవారం మంగళగిరిలోని అరణ్యభవన్‌లో ఏపీ గ్రీన్‌ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ తొలి సమావేశం చైర్మన్‌ నాగబాబు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భం గా నాగబాబు మాట్లాడుతూ ‘ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా నర్సరీల ద్వారా 10కోట్ల మొక్క లు సిద్ధం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. తొలి దశలో 500 మండలాల్లో 500 నర్సరీలకు స్థలాలను గుర్తించి, 15వేల ప్రైమరీ బెడ్లును ఏర్పాటు చేస్తాం. స్థానిక యువత, మహిళా సంఘాలకు మొక్కల పెంపకం, నిర్వహణ బాధ్యతతో పాటు ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. ఎన్ని మొక్కలు నాటాం. ఎన్ని బతికాయి అనేది ముఖ్యం. పచ్చదనాన్ని పెంచే కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టాలి.’ అని చెప్పారు. ఏపీ గ్రీన్‌ సీఈవో మూర్తి, పీసీసీఎఫ్‌ చలపతిరావు, అటవీశాఖ సలహాదారు మల్లికార్జునరావు పాల్గొన్నారు.

ఈ వార్తలనూ చదవండి..

అమరావతి పనుల్లో వేగం పెంచాలి.. ప్రతి నెల రూ. 2వేల కోట్ల పనులు పూర్తి చేయాలి: సీఎం

స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పోటీ చేసే స్థానాలు ఖరారు..!

Updated Date - Oct 07 , 2026 | 04:39 AM