Share News

రొయ్యల కాలువ మరమ్మతు పనుల్లో అవినీతి

ABN , Publish Date - Oct 07 , 2026 | 04:28 AM

గూడూరు డివిజన్‌ జల వనరుల శాఖ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీరు శ్రీనివాసరావు, ఏఈఈ కృష్ణయ్య, డిఈఈ రవీంద్రబాబు డబ్బుల కోసం పనుల్లో నాణ్యతకు తిలోదకాలు ఇచ్చారు.

రొయ్యల కాలువ మరమ్మతు పనుల్లో అవినీతి

  • ఈఈపై శాఖాపరమైన విచారణ... మరో ఇద్దరికి నోటీసులు

అమరావతి, అక్టోబరు 6(ఆంధ్రజ్యోతి): గూడూరు డివిజన్‌ జల వనరుల శాఖ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీరు శ్రీనివాసరావు, ఏఈఈ కృష్ణయ్య, డిఈఈ రవీంద్రబాబు డబ్బుల కోసం పనుల్లో నాణ్యతకు తిలోదకాలు ఇచ్చారు. రొయ్యలకాలువ నీటి వనరుకు పడిన గండ్లకు శాశ్వత మరమ్మతులు చేపట్టకుండా తాత్కాలిక పనులతో సరిపెట్టారు. ఈ వ్యవహారంపై తిరుపతి జిల్లా మాకాడు మండలం, కొండాపురం గ్రామానికి చెందిన ఎం.వేణుగోపాల నాయుడు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుపై తీవ్రంగా స్పందించిన ప్రభుత్వం గండ్లు పూడ్చివేతలో నాసిరకం ముడిసరుకు వాడిన శ్రీనివాసరావుపై విజిలెన్స్‌ విచారణకు ఆదేశించింది. ఆ నివేదిక ఇటీవల ప్రభుత్వానికి చేరింది. దీంతో ఆయనపై శాఖాపరమైన విచారణ చేపడుతూ జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్‌ కుమార్‌ మంగళవారం ఉత్తర్వు జారీ చేశారు. మిగిలిన ఇద్దరినీ వ్యక్తిగతంగా సంజాయిషీ ఇవ్వాలని ఆదేశించారు.

ఈ వార్తలనూ చదవండి..

అమరావతి పనుల్లో వేగం పెంచాలి.. ప్రతి నెల రూ. 2వేల కోట్ల పనులు పూర్తి చేయాలి: సీఎం

స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పోటీ చేసే స్థానాలు ఖరారు..!

Updated Date - Oct 07 , 2026 | 04:28 AM