Share News

నిర్దేశిత ఆర్థిక పరిమితులను దాటొద్దు!

ABN , Publish Date - Sep 29 , 2026 | 04:43 AM

మున్సిపాలిటీల్లో నిర్దేశిత ఆర్థిక పరిమితులను ఉల్లంఘించి పనులకు అనుమతులు మంజూరు చేస్తే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని మున్సిపల్‌ శాఖ ఆదేశించింది.

నిర్దేశిత ఆర్థిక పరిమితులను దాటొద్దు!

  • ఉల్లంఘించి పనులకు అనుమతులు ఇస్తే చర్యలు.. మున్సిపల్‌ శాఖ ఆదేశాలు

అమరావతి, సెప్టెంబరు 28(ఆంధ్రజ్యోతి): మున్సిపాలిటీల్లో నిర్దేశిత ఆర్థిక పరిమితులను ఉల్లంఘించి పనులకు అనుమతులు మంజూరు చేస్తే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని మున్సిపల్‌ శాఖ ఆదేశించింది. మున్సిపల్‌ నిధులను విచక్షణా రహితంగా ఖర్చు చేయకుండా ఆర్థిక క్రమశిక్షణ పాటించాలని స్పష్టం చేసింది. మున్సిపల్‌ నిధులను నిర్వహణ, మూలధన వ్యయాలకు వినియోగించే విషయంలో గతంలో నిర్దేశించిన మార్గదర్శకాలను కొన్ని పట్టణ స్థానిక సంస్థలు పాటించడం లేదని ప్రభుత్వం గుర్తించింది. నిర్ణయించిన ఆర్థిక పరిమితులను మించి కొన్ని పనులకు అనుమతులు మంజూరు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని పేర్కొంది. ఇలాంటి చర్యలు మున్సిపల్‌ నిధులను సమర్థంగా వినియోగించాలన్న ప్రభుత్వ ఉద్దేశానికి విరుద్ధమని, ఆర్థిక జవాబుదారీతనం, ప్రజలకు అవసరమైన పౌరసేవల సమర్థ నిర్వహణపై ప్రభావం చూపుతాయని ప్రభుత్వం పేర్కొంది. నిబంధనల ఉల్లంఘనకు బాధ్యులైన అధికారులను గుర్తించాలని మున్సిపల్‌ శాఖ కమిషనర్‌ అండ్‌ డైరెక్టర్‌ను ప్రభుత్వం ఆదేశించింది. ఉల్లంఘనలు నిర్ధారణ అయితే సంబంధిత మున్సిపల్‌ కమిషనర్లు, ఇంజనీర్లపై నిబంధనల ప్రకారం క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది.

ఈ వార్తలనూ చదవండి...

పింఛనుదారులకు గుడ్‌న్యూస్‌.. అక్టోబర్‌ 1న ఉదయం 6:30 నుంచే పింఛన్ల పంపిణీ

పీఎం కిసాన్ 24వ విడత.. రైతులు ఈ 3 పనులు పూర్తి చేయాల్సిందే..

Updated Date - Sep 29 , 2026 | 04:43 AM