మైనార్టీలకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ: ఫరూక్
ABN , Publish Date - Oct 09 , 2026 | 04:30 AM
మైనార్టీ యువతకు నైపుణ్యాభివృద్ధి కల్పించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని రాష్ట్ర మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ తెలిపారు.
అమరావతి, అక్టోబరు 8 (ఆంధ్రజ్యోతి): మైనార్టీ యువతకు నైపుణ్యాభివృద్ధి కల్పించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని రాష్ట్ర మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ తెలిపారు. గురువారం మంగళగిరిలోని ఉర్దూ అకాడమీ కార్యాలయంలో చైర్మన్ ఫారూక్ షుబ్లీ అధ్యక్షతన రూ.3.31 కోట్లతో కొనుగోలు చేసిన 216 కంప్యూటర్లు, ప్రింటర్లు, యూపీఎ్‌సలను కంప్యూటర్ శిక్షణ కేంద్రాల(సీటీసీ)కు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కర్నూలు, నంద్యాల, మంగళగిరి, విశాఖపట్నం, గుంటూరు, మదనపల్లె సీటీసీలను ప్రత్యేక శిక్షణ కేంద్రాలుగా అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ తదితరులు పాల్గొన్నారు.
ఈ వార్తలనూ చదవండి:
ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ.. చర్చించిన కీలక అంశాలివే..
డిజిటల్ కరెన్సీని మోదీ ప్రోత్సహించారు