మీ భూమిపై ఇతరుల పెత్తనమా?
ABN , Publish Date - Aug 11 , 2026 | 05:59 AM
‘మీ భూమి-మీ హక్కు. దానిపై ఇతరులు పెత్తనం చేయడానికి వీల్లేదు. పాస్ పుస్తకాలపై ఇతరులు ఫొటోలు ఎలా వేసుకుంటారు? ప్రజల సమస్యలు పరిష్కరించని వారు ఏమయ్యారో...
పాస్‌పుస్తకాలపై వాళ్ల ఫొటోలా?
భూములున్నా రైతులు అమ్ముకోలేకపోయారు
పిల్లల పెళ్లిళ్లు, చదువులకు అక్కరకు రాలేదు
2019-24 మధ్య రెవెన్యూ రికార్డులు ధ్వంసం
ఇష్టం లేనివాళ్ల భూములు 22ఏలో చేర్చారు
భూ రికార్డుల ప్రక్షాళనకు నాడే సంకల్పించా
కూటమి వచ్చాక రెవెన్యూలో సంస్కరణలు
6 రకాల భూములకు మోక్షం
ఇప్పటివరకు రైతులకు 32.22 లక్షల
పట్టాదార్ పాస్‌పుస్తకాలు పంపిణీ
కలిదిండి సభలో సీఎం చంద్రబాబు
ఏలూరు/కలిదిండి, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): ‘మీ భూమి-మీ హక్కు. దానిపై ఇతరులు పెత్తనం చేయడానికి వీల్లేదు. పాస్ పుస్తకాలపై ఇతరులు ఫొటోలు ఎలా వేసుకుంటారు? ప్రజల సమస్యలు పరిష్కరించని వారు ఏమయ్యారో అందరికీ తెలుసు’ అని వైసీపీ అధ్యక్షుడు జగన్‌కు సీఎం చంద్రబాబు చురకలంటించారు. రాష్ట్రంలో భూమి చేతిలో ఉన్నప్పటికీ అనేక మంది రైతులు వాటిని అమ్ముకోలేకపోయారని.. పిల్లల చదువులు, పెళ్లిళ్లకు ఉపయోగపడని ఎందుకని చాలా మంది తన వద్ద ఆవేదన వ్యక్తం చేశారని తెలిపారు. జగన్ పాలనలో అస్తవ్యస్తంగా మారిన భూరికార్డుల ప్రక్షాళనకు సంక ల్పం తీసుకున్నానని తెలిపారు. ఆ మేరకు రెవెన్యూలో సంస్కరణలు తీసుకొచ్చామని.. 6 రకాల భూములకు మోక్షం కల్పించే దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. ‘ఇప్పుడు రైతులు, ప్రజల కళ్లల్లో ఆనందం చూస్తు న్నాం. ఇదంతా మీ సహకారం.. కూటమిపై పెట్టుకున్న నమ్మకం వల్లే సాధ్యమైంది’ అని స్పష్టం చేశారు. ఏలూరు జిల్లా కలిదిండిలో సోమవారం జరిగిన ‘మీ భూమి-మీ హక్కు’ గ్రామసభలో సీఎం పాల్గొన్నారు. నల్లజర్ల దుర్గాభవాని అనే మహిళా రైతుతో పాటు 14 మందికి రాజముద్రతో కూడిన పట్టాదార్ పాస్ పుస్తకా లు అందించారు. అంతకుముందు తహశీల్దార్ కార్యాలయంలో మాజీ సైనికులు, రైతులతో ముచ్చటించారు. అనంతరం సభలో మాట్లాడారు. గత పాలకులు 2019-24 మధ్య చేసిన విఽధ్వంసం కారణంగా రికార్డు లు ధ్వంసమయ్యాయన్నారు. ఇష్టంలేని వ్యక్తుల భూ ములను, ఆస్తులను 22ఏలో పెట్టేసి వివాదాస్పదం చేశారన్నారు. 2024లో కూటమి వచ్చాక.. ఎక్కడకు వెళ్లినా భారీ ఎత్తున భూములపై ఫిర్యాదులు వచ్చాయని.. అన్ని సమస్యలనూ పరిష్కరించాలని ఆ రోజే సంకల్పించానని తెలిపారు. ‘భూసమస్యలను పరిష్కరించాలని రెవెన్యూ మంత్రి అనగాని, సీఎస్ సాయిప్రసాద్, సీసీఎల్‌ఏ జయలక్ష్మి.. ఈ ముగ్గురికీ పదేపదే చెబుతుంటా. ప్రతి నెలా 9న పట్టాదారు పాస్ పుస్తకాలను జారీచేయాలని వెంటపడుతున్నాను’ అని చెప్పా రు. 75 నిమిషాలకుపైనే ప్రసంగించిన చంద్రబాబు.. అన్ని వర్గాలనూ ఉత్తేజపరిచారు.

ట్యాంపరింగ్‌కు అవకాశం లేకుండా..
ఇప్పటి వరకు 7 దఫాలుగా 7,451 గ్రామాల్లో 32.22 లక్షల పట్టాదార్ పాస్‌పుస్తకాలు పంపిణీ చేశాం. వచ్చే 7 నెలల్లో 9,365 గ్రామాల్లో 68.64 లక్షల పాస్‌పుస్తకా లు జారీచేస్తాం. ట్యాంపరింగ్‌కు అవకాశం లేకుండా కరెన్సీకి ఉండే భద్రతా ఫీచర్లతో సెక్యూరిటీ ప్రెస్‌లో వీటిని తయారుచేయిస్తున్నాం. వీటి పంపిణీతో రైతుల ఆనందం చూశారా? ఈ కిక్ మీకు(ప్రజాప్రతినిధులు, అధికారులకు) అర్థమైందా? 1986 నుంచి రికార్డుల డిజిటిలైజేషన్ ప్రక్రియ చేస్తున్నాం. లింక్ డాక్యుమెంట్లన్నీ ఆన్‌లైన్ ద్వారా అంది స్తాం. ఇప్పటి వరకు 9 లక్షల మం దికి ఆటోమ్యుటేషన్ సౌకర్యం కల్పించాం. వారసత్వ భూములు రూ.10 లక్షలలోపు విలువ ఉన్న వా టిని కేవలం వెయ్యి రూపాయలతో బదిలీ చేసుకునే అవకాశం కల్పిం చాం. రీసర్వే ప్రక్రియ రైతుల సమక్షంలోనే చేసి ఈకేవైసీ తీసుకున్న తర్వాతే రాజముద్రతో కూడి పాస్ పుస్తకాలను ముద్రించి పంపిణీ చేస్తున్నాం. నా జీవితంలో ఇంతకం టే ఆనందం ఇంకొంకటి ఉంటుందా? కలిదిండిలో 6 రకాల భూములకు సంబంధించి2వేలమందికిపట్టాలిచ్చాం. ఆక్వా రైతులకు రూ.1.50కు యూనిట్ చొప్పున రాయితీ విద్యుత్‌ను ఇస్తు న్నాం. రూ.1150 కోట్ల అదనపు భారం పడినా.. రైతుల కోసం భరిస్తున్నాం. సూపర్ సిక్స్ పథకాలు భవిష్యత్‌లోనూ కొనసాగుతాయి.
సంకల్ప దీక్ష పూనుదాం
చంద్రబాబు అనే నేను.. 2047 స్వర్ణాంధ్ర కోసం సంకల్పం చేశాను. ప్రతి వ్యక్తీ అలా అభివృద్ధిలో భాగస్వామి కావాలి. రేపు 15వ తేదీన ప్రతి వ్యక్తీ కుడి చేతిలో జాతీయ జెండా.. మరో చేతిలో నేను అనే సంకల్పంతో ముందుకు సాగండి.
ఇవి కూడా చదవండి..
తమిళ్ తాయ్ వాళ్తుతోనే ప్రారంభం.. తమిళనాడు అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం..
సీటు బెల్ట్ పెట్టుకోని చిన్నారి.. సర్వీస్‌ను రద్దు చేసిన విమానయాన సంస్థ..