సోషల్ మీడియాలో ప్రభుత్వ పథకాల ప్రచారం
ABN , Publish Date - Sep 29 , 2026 | 06:12 AM
ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు, ప్రజా అవగాహన కార్యక్రమాలను సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
ఇన్‌ఫ్లుయెన్సర్ల ఎంప్యానెల్‌కు నిర్ణయం
విశ్వసనీయ కంటెంట్ క్రియేటర్లకు అధికారిక గుర్తింపు
అమరావతి, సెప్టెంబరు 28(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు, ప్రజా అవగాహన కార్యక్రమాలను సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. విశ్వసనీయత కలిగిన సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల (ఎస్‌ఎంఐ)ను గుర్తించి, పరిశీలించి, ఎంప్యానెల్ చేయాలని నిర్ణయించింది. ఈమేరకు సాధారణ పరిపాలన (పీఆర్) శాఖ సోమవారం జీవోఎంఎస్ నం.197 జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభావం కలిగిన డిజిటల్ కంటెంట్ క్రియేటర్లను గుర్తించి ప్రభుత్వ ప్రచార కార్యక్రమాల్లో వారిని భాగస్వాములను చేయనుంది. సంక్షేమ పథకాలు, మౌలిక వసతుల అభివృద్ధి, ప్రజా ప్రయోజన కార్యక్రమాలు, ఇతర ప్రభుత్వ కార్యక్రమాలను ఎస్‌ఎంఐల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లడం ఈ విధానం ప్రధాన ఉద్దేశం. ప్రభుత్వంతో డిజిటల్ కంటెంట్ క్రియేటర్ల మధ్య అధికారిక సహకారాన్ని ఏర్పాటు చేసేందుకు ఏపీ డిజిటల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా సోషల్ మీడియా క్రియేటర్లతో సమావేశాలు నిర్వహించింది. విశ్వసనీయత, కంటెంట్ నాణ్యత, ప్రజల్లో ప్రభావం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఎస్‌ఎంఐలను గుర్తించి ఎంప్యానెల్ చేయనున్నట్లు ప్రభుత్వం జీవోలో పేర్కొంది.
ఈ వార్తలనూ చదవండి...
పింఛనుదారులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 1న ఉదయం 6:30 నుంచే పింఛన్ల పంపిణీ
పీఎం కిసాన్ 24వ విడత.. రైతులు ఈ 3 పనులు పూర్తి చేయాల్సిందే..