Share News

రాష్ట్రపతి పర్యటనకు ప్రత్యేక కమిటీ

ABN , Publish Date - Oct 10 , 2026 | 06:04 AM

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రెండు రోజుల పర్యటన నిమిత్తం రాష్ట్రానికి రానున్న నేపథ్యంలో పంచాయతీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి చైర్మన్‌గా ప్రభుత్వం ప్రత్యేక కమిటీని నియమించింది.

రాష్ట్రపతి పర్యటనకు ప్రత్యేక కమిటీ

అమరావతి, అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రెండు రోజుల పర్యటన నిమిత్తం రాష్ట్రానికి రానున్న నేపథ్యంలో పంచాయతీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి చైర్మన్‌గా ప్రభుత్వం ప్రత్యేక కమిటీని నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. రాష్ట్రపతి పర్యటనకు ఏర్పాట్లు చేయడం, వివిధ శాఖలతో సమన్వయం చేసుకోవడం ఈ కమిటీ పని. డీజీపీ, విజయవాడ పోలీస్‌ కమిషనర్‌, ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌, కృష్ణా ఎస్పీ, దేవదాయ శాఖ కమిషనర్‌, డీవోపీ డైరెక్టర్‌, కనకదుర్గా ఆలయం ఈవోలను ఈ కమిటీకి మెంబర్లుగా నియమించారు. సెర్ప్‌ సీఈవో, సెక్రటరీని మెంబర్‌ కన్వీనర్‌గా నియమించారు.

ఈ వార్తలనూ చదవండి:

సుప్రీంకోర్టులో వైసీపీకి చుక్కెదురు..

ఏపీలో స్థానిక ఎన్నికల నగారా.! సుప్రీంకోర్టు కీలక తీర్పు

Updated Date - Oct 10 , 2026 | 06:04 AM