సంపద సృష్టికే కూటమి: నీలాయపాలెం
ABN , Publish Date - Sep 29 , 2026 | 05:53 AM
సంపద సృష్టించడం ద్వారానే సుస్థిర ప్రజాసంక్షేమం సాధ్యమనే సంకల్పంతో కూటమి ప్రభుత్వం పారిశ్రామికాభివృద్ధికి పెట్టపీట వేస్తోందని ఏపీ బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ నీలాయపాలెం విజయకుమార్ అన్నారు.
అమరావతి, సెప్టెంబరు 28(ఆంధ్రజ్యోతి): సంపద సృష్టించడం ద్వారానే సుస్థిర ప్రజాసంక్షేమం సాధ్యమనే సంకల్పంతో కూటమి ప్రభుత్వం పారిశ్రామికాభివృద్ధికి పెట్టపీట వేస్తోందని ఏపీ బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ నీలాయపాలెం విజయకుమార్ అన్నారు. యువనేత లోకేశ్ సారథ్యంలో ఏపీ పెట్టుబడులకు స్వర్గధామంగా నిలుస్తోందని తెలిపారు. 2019-24 మధ్య జగన్ విధానాల కారణంగా పరిశ్రమలు రాష్ట్రం నుంచి వెళ్లి పోయాయని అన్నారు. ప్రస్తుతం మంత్రి లోకేశ్ పెట్టుబడిదారుల్లో నమ్మకం పెంచుతూ పెట్టుబడులు ఆహ్వానిస్తున్నారని వివరించారు.
ఈ వార్తలనూ చదవండి...
పింఛనుదారులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 1న ఉదయం 6:30 నుంచే పింఛన్ల పంపిణీ
పీఎం కిసాన్ 24వ విడత.. రైతులు ఈ 3 పనులు పూర్తి చేయాల్సిందే..