ఏఈఈ పోస్టుల మెరిట్ జాబితా నిబంధనల సవరణ
ABN , Publish Date - Oct 10 , 2026 | 04:35 AM
ఏపీ విద్యుత్తు సంస్థల్లో ఏఈఈ పోస్టుల భర్తీ నోటిఫికేషన్‌కు సంబంధించి కీలక సవరణలు చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో విడుదల చేసిన నోటిఫికేషన్‌లోని మెరిట్ జాబితా రూపకల్పన ...
అమరావతి, అక్టోబరు9 (ఆంధ్రజ్యోతి): ఏపీ విద్యుత్తు సంస్థల్లో ఏఈఈ పోస్టుల భర్తీ నోటిఫికేషన్‌కు సంబంధించి కీలక సవరణలు చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో విడుదల చేసిన నోటిఫికేషన్‌లోని మెరిట్ జాబితా రూపకల్పన నిబంధనలకు అనుబంధ మార్గదర్శకాలను జోడించినట్లు ఇంధన శాఖ కార్యదర్శి విజయానంద్ ఓ ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులకు సమాన మార్కులు వచ్చినప్పుడు ర్యాంకుల కేటాయింపు నిబంధనల్లో కొన్ని సవరణలు చేసినట్లు చెప్పారు. ఈ సవరణల పూర్తి వివరాలను ఏపీ విద్యుత్తు నియమక పోర్టల్‌లో చూడాలన్నారు.
ఈ వార్తలనూ చదవండి:
సుప్రీంకోర్టులో వైసీపీకి చుక్కెదురు..
ఏపీలో స్థానిక ఎన్నికల నగారా.! సుప్రీంకోర్టు కీలక తీర్పు