డీటీలకు ఏపీ సివిల్ సర్వీసెస్ రూల్స్
ABN , Publish Date - Oct 07 , 2026 | 05:34 AM
రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణ నేపథ్యంలో డిప్యూటీ తహసీల్దార్ల(డీటీ) సర్వీసు రూల్స్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
అమరావతి, అక్టోబరు 6(ఆంధ్రజ్యోతి): రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణ నేపథ్యంలో డిప్యూటీ తహసీల్దార్ల(డీటీ) సర్వీసు రూల్స్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఏపీ రెవెన్యూ సబార్డినేట్ సర్వీసు రూల్ప్ పరిధిలో ఇప్పటి దాకా ఉన్న వారిని ఇప్పుడు కొత్తగా ఏపీ సివిల్ సర్వీసెస్ రూల్స్ పరిధిలోకి తీసుకొచ్చారు. ఈ మేరకు కేటగిరీ-4 కింద వారి సర్వీసును చేరుస్తూ రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి. సాయిప్రసాద్(జీవో 626) ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఏపీ రెవెన్యూ సబార్డినేట్ సర్వీసు రూల్స్‌లో డీటీలను చేరుస్తూ 1992లో జారీ చేసిన రూల్స్‌ను రిపీల్ చేస్తూ మరో ఉత్తర్వు(జీవో 625) జారీ చేశారు.
ఈ వార్తలనూ చదవండి..
అమరావతి పనుల్లో వేగం పెంచాలి.. ప్రతి నెల రూ. 2వేల కోట్ల పనులు పూర్తి చేయాలి: సీఎం
స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పోటీ చేసే స్థానాలు ఖరారు..!