కొత్త జిల్లాల జెడ్పీ సీఈఓల పోస్టింగులెప్పుడు?
ABN , Publish Date - Oct 10 , 2026 | 04:33 AM
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల హడావుడి ఊపందుకున్న నేపథ్యంలో కొత్త జిల్లాల్లో జెడ్పీ సీఈఓ, డిప్యూటీ సీఈఓ పోస్టుల నియామకం జరగకపోవడంతో కలెక్టర్లు ఆందోళన చెందుతున్నారు.
ఎన్నికల ప్రక్రియ పర్యవేక్షణ భారం.. ఉమ్మడి జిల్లాల అధికారులపైనే
అమరావతి, అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల హడావుడి ఊపందుకున్న నేపథ్యంలో కొత్త జిల్లాల్లో జెడ్పీ సీఈఓ, డిప్యూటీ సీఈఓ పోస్టుల నియామకం జరగకపోవడంతో కలెక్టర్లు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే పంచాయతీరాజ్ శాఖ రాష్ట్రంలో కొత్తగా 13 జిల్లా పరిషత్‌లను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయా జిల్లా పరిషత్‌లకు సీఈఓలు, డిప్యూటీ సీఈఓలు, ఇతర సిబ్బందిని నియమించేందుకు సన్నాహాలు ప్రారంభించింది. పలువురు డీడీఓలను, డిప్యూటీ సీఈఓలను నియమించింది. కొత్త జిల్లాలతో పాటు రెండు పాత జిల్లాల్లో ఖాళీలు కలిపి మొత్తం 15 జిల్లాల్లో సీఈఓలను, పలువురు డిప్యూటీ సీఈఓలను నియమించేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. సీఎం వద్ద నుంచి క్లియరెన్స్ రాకపోవడంతో ఉత్తర్వులు విడుదల కాలేదు. దీంతో కొత్త జిల్లాల్లో ఎన్నికల ప్రక్రియను ఉమ్మడి జిల్లాల అధికారులే పర్యవేక్షించాల్సి రావడంతో పలువురు జెడ్పీ సీఈఓలు ఒత్తిడికి గురవుతున్నారు. ప్రభుత్వం వెంటనే పోస్టులను భర్తీ చేయాలని కోరుతున్నారు.
ఈ వార్తలనూ చదవండి:
సుప్రీంకోర్టులో వైసీపీకి చుక్కెదురు..
ఏపీలో స్థానిక ఎన్నికల నగారా.! సుప్రీంకోర్టు కీలక తీర్పు