Share News

సానుకూలంగా ఆలోచించండి!

ABN , Publish Date - Sep 29 , 2026 | 06:14 AM

ఏపీలో ని న్యాయస్థానాల్లో దశాబ్దన్నరకాలంగా సేవలందిస్తున్న ఉద్యోగుల క్రమబద్ధీకరణ అంశంపై సానుకూల దృక్పథంతో ఆలోచించాలని ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచించింది.

సానుకూలంగా ఆలోచించండి!

  • కోర్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణపై రాష్ట్రానికి సుప్రీం సూచన

న్యూఢిల్లీ, సెప్టెంబరు 28(ఆంధ్రజ్యోతి): ఏపీలో ని న్యాయస్థానాల్లో దశాబ్దన్నరకాలంగా సేవలందిస్తున్న ఉద్యోగుల క్రమబద్ధీకరణ అంశంపై సానుకూల దృక్పథంతో ఆలోచించాలని ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సుమారు 15 ఏళ్ల క్రితం హైకోర్టు పరిధి లోని కోర్టుల్లో ప్యూన్లు, అటెండర్లు, స్టెనోగ్రాఫర్లు, రికార్డు అసిస్టెంట్లు, డ్రైవర్లు తదితర హోదాల్లో వందలాది మందిని ఔట్‌ సోర్సింగ్‌ విధానంలో నియమించారు. తమను రెగ్యులర్‌ చేయాలని కోరుతూ తొలుత వందమంది హైకోర్టును ఆశ్రయించారు. రాష్ట్ర ప్రభుత్వం ఒక జీవో తీసుకొచ్చి వారిని రెగ్యులర్‌ చేసింది. దీంతో అదే జీవో కింద తమనూ రెగ్యులర్‌ చేయాలని కోరుతూ మిగిలిన 100 మంది సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

ఈ వార్తలనూ చదవండి...

పింఛనుదారులకు గుడ్‌న్యూస్‌.. అక్టోబర్‌ 1న ఉదయం 6:30 నుంచే పింఛన్ల పంపిణీ

పీఎం కిసాన్ 24వ విడత.. రైతులు ఈ 3 పనులు పూర్తి చేయాల్సిందే..

Updated Date - Sep 29 , 2026 | 06:14 AM