పన్ను రేట్లను హేతుబద్దీకరించాలి : ఏపీ చాంబర్స్
ABN , Publish Date - Oct 10 , 2026 | 04:47 AM
పన్ను రేట్ల హేతుబద్దీకరణకు సంస్కరణలు తీసుకురావాలని ఏపీ చాంబర్స్ అధ్యక్షుడు పొట్లూరి భాస్కరరావు ప్రభుత్వాన్ని కోరారు. వ్యాపార నిర్వహణను సులభతరం చేయడం, నిబంధనల అమలును సరళీకృతం చేయడం,...
అమరావతి, అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి): పన్ను రేట్ల హేతుబద్దీకరణకు సంస్కరణలు తీసుకురావాలని ఏపీ చాంబర్స్ అధ్యక్షుడు పొట్లూరి భాస్కరరావు ప్రభుత్వాన్ని కోరారు. వ్యాపార నిర్వహణను సులభతరం చేయడం, నిబంధనల అమలును సరళీకృతం చేయడం, జరిమానాలు, ప్రాసిక్యూషన్లను తగ్గించడం, రిఫండ్‌ల ప్రక్రియను వేగవంతం చేయడం కోసం 57వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం చేసిన సిఫారసులను ఏపీ చాంబర్స్ స్వాగతిస్తోందని ఆయన తెలిపారు. అయితే, ఫుడ్ ప్రాసెసింగ్, పండ్ల గుజ్జు ఆధారిత పానీయాలు, హాస్పిటాలిటీ, వస్త్రాలు, దుస్తుల రంగాల్లో జీఎస్టీ రేట్లను మరింత హేతుబద్ధీకరించాలని శుక్రవారం ఒక ప్రకటనలో భాస్కరరావు ప్రభుత్వాన్ని కోరారు.
ఈ వార్తలనూ చదవండి:
సుప్రీంకోర్టులో వైసీపీకి చుక్కెదురు..
ఏపీలో స్థానిక ఎన్నికల నగారా.! సుప్రీంకోర్టు కీలక తీర్పు