Share News

సర్‌ గడువు పొడిగించండి

ABN , Publish Date - Oct 27 , 2026 | 05:40 AM

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) 2026 గడువును మరో వారం రోజులు పొడిగించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) వివేక్‌ యాదవ్‌ కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరినట్లు తెలిసింది.

సర్‌ గడువు పొడిగించండి

కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరిన సీఈవో!

అమరావతి, అక్టోరు 26 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) 2026 గడువును మరో వారం రోజులు పొడిగించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) వివేక్‌ యాదవ్‌ కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరినట్లు తెలిసింది. రాష్ట్రంలో సర్‌ విధుల్లో ఉన్న అధికారులు స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ఏర్పాట్లలో నిమగ్నమై ఉండడం, ముసాయిదా జాబితాపై వచ్చిన క్లెయిములు, అభ్యంతరాల పరిష్కార ప్రక్రియ కొన్నిచోట్ల ఇంకా పూర్తి కావాల్సి ఉన్నందున సర్‌ గడువు పొడిగించాలని కొన్ని జిల్లాల ఎన్నికల అధికారులు కోరిన నేపథ్యంలో ఆయన వారి అభ్యర్థనలను కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లారు.

ఈ వార్తలనూ చదవండి:

బంగాళాఖాతంలో తీవ్ర తుఫాన్‌గా బలపడిన ‘అర్నబ్’

అతి తీవ్ర తుఫాను..ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్

Updated Date - Oct 27 , 2026 | 05:40 AM