Share News

డేటా సెంటర్లపై వైసీపీ దుష్ప్రచారం: నీలాయపాలెం

ABN , Publish Date - Oct 09 , 2026 | 04:34 AM

వైజాగ్‌లో ఏర్పాటవుతున్న ఏఐ, హైపర్‌ స్కేల్‌ డేటా సెంటర్‌ రాష్ట్ర ఆర్థిక స్థితిని మార్చబోతోందని ఏపీ బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్‌ నీలాయపాలెం విజయ్‌కుమార్‌ అన్నారు.

డేటా సెంటర్లపై వైసీపీ దుష్ప్రచారం: నీలాయపాలెం

అమరావతి, అక్టోబరు 8(ఆంధ్రజ్యోతి): వైజాగ్‌లో ఏర్పాటవుతున్న ఏఐ, హైపర్‌ స్కేల్‌ డేటా సెంటర్‌ రాష్ట్ర ఆర్థిక స్థితిని మార్చబోతోందని ఏపీ బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్‌ నీలాయపాలెం విజయ్‌కుమార్‌ అన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. విశాఖ నగరం గ్లోబల్‌ టెక్నాలజీ సెంటర్‌గా అభివృద్ధి చెందుతోందని అన్నారు. దీన్ని అడ్డుకునేందుకు జగన్‌ అండ్‌ కో కుట్రలు చేస్తోందని అన్నారు. పేటీఎం బ్యాచ్‌లతో డేటా సెంటర్లపై దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. సముద్రంలోకి వృథాగా పోయే నీటినే డేటా సెంటర్లకు అందిస్తామని అన్నారు.

ఈ వార్తలనూ చదవండి:

ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ.. చర్చించిన కీలక అంశాలివే..

డిజిటల్ కరెన్సీని మోదీ ప్రోత్సహించారు

Updated Date - Oct 09 , 2026 | 04:34 AM