Share News

బీసీ గురుకుల ఉద్యోగులకు బదిలీలు

ABN , Publish Date - Oct 07 , 2026 | 05:28 AM

మహాత్మా జ్యోతిబాపూలే ఆంధ్రప్రదేశ్‌ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ (ఎంజేపీ ఏపీ బీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్)లో పనిచేస్తున్న బోధన, బోధనేతర సిబ్బంది బదిలీలకు ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది.

బీసీ గురుకుల ఉద్యోగులకు బదిలీలు

అమరావతి, అక్టోబరు 6(ఆంధ్రజ్యోతి): మహాత్మా జ్యోతిబాపూలే ఆంధ్రప్రదేశ్‌ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ (ఎంజేపీ ఏపీ బీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్)లో పనిచేస్తున్న బోధన, బోధనేతర సిబ్బంది బదిలీలకు ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ మేరకు బీసీ సంక్షేమ శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఒకే సంస్థలో ఎనిమిది విద్యా సంవత్సరాలు పూర్తిచేసిన ఉద్యోగులను తప్పనిసరిగా బదిలీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. విద్యా సంవత్సరంలో సగానికి పైగా పనిచేసిన కాలాన్ని పూర్తి విద్యా సంవత్సరంగా పరిగణిస్తారు. ఈ లెక్కన ప్రిన్సిపాళ్లు 1-6-2020కు ముందు, ఇతర ఉద్యోగులు 1-6-2017కు ముందు సంబంధిత సంస్థలో చేరి ఉంటే తప్పనిసరి బదిలీ పరిధిలోకి వస్తారు. ఒకే స్టేషన్‌లో కనీసం రెండేళ్ల సర్వీసు పూర్తి చేసినవారు మాత్రమే బదిలీ అభ్యర్థనకు అర్హులు. బాలికల గురుకులాల్లో పనిచేస్తున్న 50 ఏళ్లలోపు పురుష ఉద్యోగులు, ప్రిన్సిపాళ్లు, బోధనేతర సిబ్బందిని బాలుర గురుకులాలకు బదిలీ చేస్తారు. కాగా, రెండేళ్లలోపు పదవీ విరమణ చేసే ఉద్యోగులను తప్పనిసరి బదిలీల నుంచి మినహాయించారు. దృష్టిలోపం ఉన్నవారికీ మినహాయింపు ఉంటుంది. అయితే వీరు స్వచ్ఛందంగా బదిలీ కోరితే అనుమతిస్తారు.

ఈ వార్తలనూ చదవండి..

అమరావతి పనుల్లో వేగం పెంచాలి.. ప్రతి నెల రూ. 2వేల కోట్ల పనులు పూర్తి చేయాలి: సీఎం

స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పోటీ చేసే స్థానాలు ఖరారు..!

Updated Date - Oct 07 , 2026 | 05:28 AM