కాలేజీల అఫిలియేషన్లకు ఏకీకృత విధానం!
ABN , Publish Date - Oct 27 , 2026 | 05:22 AM
రాష్ట్రంలో కాలేజీల అఫిలియేషన్లకు సమగ్ర విధానం తీసుకురావాలని ఉన్నత విద్యాశాఖ నిర్ణయించింది. ప్రస్తుతం రాష్ట్రంలో కాలేజీల అఫిలియేషన్ల మంజూరుకు ఒక్కో యూనివర్సిటీ ఒక్కో విధానాన్ని అనుసరిస్తోంది. ఫీజులు కూడా ఆయా వర్సిటీలే నిర్ణయించుకుంటున్నాయి.
ప్రస్తుతం ఒక్కో వర్సిటీలో ఒక్కోలా నిబంధనలు
వీసీలు, రిజిస్ట్రార్లతో కమిటీ.. నెలలో నివేదిక
అమరావతి, అక్టోబరు 26(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కాలేజీల అఫిలియేషన్లకు సమగ్ర విధానం తీసుకురావాలని ఉన్నత విద్యాశాఖ నిర్ణయించింది. ప్రస్తుతం రాష్ట్రంలో కాలేజీల అఫిలియేషన్ల మంజూరుకు ఒక్కో యూనివర్సిటీ ఒక్కో విధానాన్ని అనుసరిస్తోంది. ఫీజులు కూడా ఆయా వర్సిటీలే నిర్ణయించుకుంటున్నాయి. దీనివల్ల ఏటా అకడమిక్ క్యాలెండర్ అమలుపై ప్రతికూల ప్రభావం పడుతోంది. ఈ నేపథ్యంలో సమగ్ర విధానం రూపకల్పనకు తగిన సిఫారసులు చేసేందుకు ఉపకులపతులు, రిజిస్ర్టార్లతో ఉన్నత విద్యాశాఖ ఒక కమిటీ ఏర్పాటు చేసింది. దీనిపై మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఉన్నత విద్యామండలి చైర్మన్ ఈ కమిటీకి చైర్‌పర్సన్‌గా ఉన్నారు. మెంబర్ కన్వీనర్‌గా ఉన్నత విద్య కమిషనర్ వ్యవహరిస్తారు. ఆంరఽధ, ఆదికవి నన్నయ, జేఎన్‌టీయూ కాకినాడ వీసీలు, ఎస్వీయూ, కృష్ణా, జేఎన్‌టీయూ అనంతపురం రిజిస్ర్టార్లు సభ్యులుగా ఉన్నారు. నెల రోజుల్లో తగిన సిఫారసులతో కమిటీ నివేదిక అందించాలని ప్రభుత్వం ఆదేశించింది.
అధ్యయనం చేయాల్సిన అంశాలు...
ప్రస్తుతం అమల్లో ఉన్న అఫిలియేషన్ విధానాలు, కాలవ్యవధి, షరతులు, ఫీజుల విధానం...
ఇతర రాష్ట్రాల విధానాలను ముఖ్యంగా మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, కేరళ, యూపీ విధానాలు పరిశీలించాలి.
తాత్కాలిక అఫిలియేషన్, బ్లాక్ పీరియడ్ అఫిలియేషన్, శాశ్వత అఫిలియేషన్... ఒక తరగతి నుంచి మరో తరగతికి మార్చడం పరిశీలన.
అడ్మిషన్ల షెడ్యూలుకు అనుగుణంగా అన్ని వర్సిటీల్లో ఉమ్మడి ప్రవేశ పరీక్షల నిర్వహణకు క్యాలెండర్ రూపకల్పన. ఆ మేరకు అఫిలియేషన్లకు గడువు విధించే అంశాలపై సిఫార్సులు
రాష్ట్ర పరిధిలో ఏకీకృత నిబంధనలు లేని బీఈడీ, లా కాలేజీలకు నిబంధనలు.
సీట్లు, సెక్షన్ల మంజూరుకు ఒకే కాలపరిమితి విధానం అమలు చేయవచ్చా?
వర్సిటీలు ప్రస్తుతం వేర్వేరుగా అమలుచేస్తున్న అఫిలియేషన్ల ఫీజుల ఏకీకృత విధానం అమలు.
అభివృద్ధికి గణాంకాలు కీలకం
విద్యామండలి ఇన్‌చార్జ్ చైర్మన్ ఎస్.విజయభాస్కర్
ఉన్నత విద్యాసంస్థల సమగ్రాభివృద్ధి, సమర్థవంతమైన విద్యా ప్రణాళికల రూపకల్పనకు క చ్చితమైన గణాంకాలు కీలకమని ఉన్నత విద్యామండలి ఇన్‌చార్జ్ చైర్మన్ ఆచార్య ఎస్.విజయభాస్కర్‌రావు అన్నారు. సోమవారం విజయవాడలో జరిగిన ‘అఖిలభారత ఉన్నత విద్య సర్వే’(ఏఐఎస్‌హెచ్‌ఈ) సదస్సులో మాట్లాడారు. ఉన్న త విద్యాసంస్థల ప్రొఫైల్, విశ్వసనీయత, ప్రత్యేకతలను గణాంకాలు ప్రతిబింబిస్తాయన్నారు.
డేటా నమోదులో పొరపాట్లు ఉంటే అది జీఈఆర్‌పై ప్రభావం చూపుతుందన్నారు. విద్యా సంస్థల నుంచి సేకరించే సమాచారాన్ని సంబంధిత రికార్డులతో సరిపోల్చి, ధ్రువీకరించిన తర్వాతే సమర్పించాలని ఏఐఎస్‌హెచ్‌ఈ రాష్ట్ర నోడల్ అధికారి కె.రత్నశీలమణి అన్నారు. ఈ సదస్సులో మండలి కార్యదర్శి బి.తిరుపతిరావు, ఏఐఎస్‌హెచ్‌ఈ-ఢిల్లీ ప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ వార్తలనూ చదవండి:
బంగాళాఖాతంలో తీవ్ర తుఫాన్‌గా బలపడిన ‘అర్నబ్’
అతి తీవ్ర తుఫాను..ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్