ఓపెన్ యూనివర్సిటీ తరగతులు ప్రారంభం
ABN , Publish Date - Nov 23 , 2026 | 06:02 AM
బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ 2026-27 విద్యా సంవత్సరం తరగతులు ఆదివారం ప్రారంభమయ్యాయి.
ఏలూరులో ఏర్పాటు చేసిన ప్రభుత్వం.. సెంట్రల్ జైళ్ల ఖైదీలకూ విద్యావకాశాలు
అమరావతి, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ 2026-27 విద్యా సంవత్సరం తరగతులు ఆదివారం ప్రారంభమయ్యాయి. ప్రాంతీయ సమన్వయ కేంద్రాలు, అభ్యసన సహాయ కేంద్రాల్లో తరగతులు ప్రారంభించారు. గతంలో హైదరాబాద్‌లోని ఓపెన్ యూనివర్సిటీ ఉమ్మడిగా ఉండేది. రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు పూర్తయ్యిందన్న కారణంతో తెలంగాణ ప్రభుత్వం రెండేళ్లుగా ఏపీలోని కేంద్రాలకు సేవలు నిలిపివేసింది. దీంతో ప్రభుత్వం ఏలూరులో రాష్ర్టానికి సొంత ఓపెన్ యూనివర్సిటీ ప్రారంభించింది. తరగతుల ప్రారంభం సందర్భంగా యూనివర్సిటీ ఇన్‌చార్జ్ వీసీ ప్రొఫెసర్ ఎస్.విజయభాస్కర్ వర్చువల్ విధానంలో విద్యార్థులు, ఫ్యాకల్టీతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఓపెన్ యూనివర్సిటీ ప్రధాన కార్యాలయాన్ని హైదరాబాద్ నుంచి ఏలూరుకు తరలించి విద్యా కార్యక్రమాల పునఃప్రారంభానికి కార్యాచరణ ప్రణాళిక రూపొందించిందని తెలిపారు. అనుమతి పొందిన ఆరు కోర్సుల్లో 6298 మంది విద్యార్థులు అడ్మిషన్లు పొందారు. రాజమండ్రి, నెల్లూరు, కడప కేంద్రా కారాగాల్లోని 59 మంది ఖైదీలకు కూడా ఉచితంగా విద్యను అభ్యసించే అవకాశం కల్పిస్తున్నట్టు ఇన్‌చార్జ్ వీసీ తెలిపారు. విద్యా క్యాలెండర్ ప్రకారం తరగతులునిర్వహించి, నిర్ణీత సమయంలో పాఠ్యాంశాలను పూర్తిచేయాలని ఫ్యాకల్టీకి సూచించారు.