Share News

న్యాయమూర్తులకు న్యాయవాదుల సన్మానం

ABN , Publish Date - Oct 10 , 2026 | 04:24 AM

రాష్ట్ర హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా నియమితులైన జస్టిస్‌ కుంచెం మహేశ్వరరావు, జస్టిస్‌ టీసీ ధనశేఖర్‌, జస్టిస్‌ చల్లా గుణరంజన్‌, జస్టిస్‌ అవధానం హరిహరనాథ శర్మ, జస్టిస్‌ యడవల్లి లక్ష్మణరావు...

న్యాయమూర్తులకు న్యాయవాదుల సన్మానం

అమరావతి, అక్టోబరు 9(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా నియమితులైన జస్టిస్‌ కుంచెం మహేశ్వరరావు, జస్టిస్‌ టీసీ ధనశేఖర్‌, జస్టిస్‌ చల్లా గుణరంజన్‌, జస్టిస్‌ అవధానం హరిహరనాథ శర్మ, జస్టిస్‌ యడవల్లి లక్ష్మణరావులను హైకోర్టు న్యాయవాదుల సంఘం బుధవారం ఘనంగా సన్మానించింది. శుక్రవారం భోజన విరామ సమయంలో హైకోర్టు అసోసియేషన్‌ హాలులో హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు వాసిరెడ్డి ప్రభునాథ్‌ ఆధ్వర్యంలో న్యాయమూర్తులను శాలువాలతో సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదుల సంఘం ఉపాధ్యక్షుడు పీటా రామన్‌, ప్రధాన కార్యదర్శి తిరుమలశెట్టి కిరణ్‌, ఇతర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

ఈ వార్తలనూ చదవండి:

సుప్రీంకోర్టులో వైసీపీకి చుక్కెదురు..

ఏపీలో స్థానిక ఎన్నికల నగారా.! సుప్రీంకోర్టు కీలక తీర్పు

Updated Date - Oct 10 , 2026 | 04:24 AM