Share News

బీజేపీ బలోపేతానికి యువత ముందుండాలి

ABN , Publish Date - Mar 02 , 2026 | 12:19 AM

భారతీయ జనతా పార్టీ సంస్థాగతంగా బలోపేతం చేయడంలో యువత ముందుండి పనిచేయాలని బీజేపీ యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు సునీల్‌రెడ్డి పిలుపునిచ్చారు.

బీజేపీ బలోపేతానికి యువత ముందుండాలి
మాట్లాడుతున్న బీజేపీ యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు

పుట్టపర్తిరూరల్‌, మార్చి 1(ఆంధ్రజ్యోతి): భారతీయ జనతా పార్టీ సంస్థాగతంగా బలోపేతం చేయడంలో యువత ముందుండి పనిచేయాలని బీజేపీ యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు సునీల్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక గణేష్‌ కూడలి నుంచి జిల్లా పార్టీ కార్యాలయం వరకు నాయకులు, కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. అనంతరం పార్టీ జిల్లా అధ్యక్షుడు జీఎం శేఖర్‌ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో పార్టీని బలోపేతం చేయడంలో భాగంగా విస్తృత కార్యక్రమాలు చేపట్టాలన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో యువత పెద్దఎత్తున పోటీ చేయడానికి కృషిచేయాలన్నారు. ప్రధాని నరేంద్రమోడీ ప్రవేశపెట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు పూర్తి స్థాయిలో వివరించాలన్నారు. గ్రామీణస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలన్నారు. కార్యక్రమంలో జాతీయ కౌన్సిల్‌ అధ్యక్షుడు విష్ణువర్ధనరెడ్డి, రాష్ట్ర మాజీ అధ్యక్షుడు మిట్టా వంశీకృష్ణ , బీజేపీ ఓబీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆదినారాయణ, రాష్ట్రనాయకులు తలుపుల గంగాధర్‌, సూర్యప్రకా్‌షరెడ్డి ఉదయ్‌కుమార్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి హరికృష్ణగౌడ్‌ పాల్గొన్నారు.

Updated Date - Mar 02 , 2026 | 12:19 AM