ఘనంగా యోగి వేమన జయంతి
ABN , Publish Date - Jan 19 , 2026 | 12:11 AM
స్థానిక శ్రీసాయి జూనియర్ కళాశాలలో యోగివేమన జయంతిని ఆదివారం ఘనంగా నిర్వహించారు.
గుత్తి, జనవరి 18(ఆంధ్రజ్యోతి): స్థానిక శ్రీసాయి జూనియర్ కళాశాలలో యోగివేమన జయంతిని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పలువురు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఇందులో ఆ కళాశాల ప్రిన్సిపాళ్లు వెంకటేశ్వర్‌రెడ్డి, కాంతారెడ్డి, ప్రసన్నకుమార్, బీజేపీ రాయలసీమ జోన ఇన్చార్జి తిమ్మారెడ్డి, న్యాయవాదులు పరమేశ్వరరెడ్డి, జయరామిరెడ్డి పాల్గొన్నారు.