Share News

వైభవంగా ఎల్లమ్మ జాతర

ABN , Publish Date - Mar 21 , 2026 | 12:11 AM

మం డలంలోని ఓరువాయిలో శ్రీ రేణుక ఎల్లమ్మ జా తరను గ్రామస్థులు శుక్రవారం వైభవంగా నిర్వహించారు.

వైభవంగా ఎల్లమ్మ జాతర
ఎల్లమ్మ పూజలో భక్తులు

నల్లచెరువు, మార్చి 20 (ఆంధ్రజ్యోతి): మం డలంలోని ఓరువాయిలో శ్రీ రేణుక ఎల్లమ్మ జా తరను గ్రామస్థులు శుక్రవారం వైభవంగా నిర్వహించారు. ఉగాది సందర్భంగా ఏటా ఇలా జాతర నిర్వహించడం ఆనవాయితీ. గ్రామస్థు లు శుక్రవారం తెల్లవారుజామున మూడు గం టల సమయంలో ఓరువాయి పంచాయతీలోని 12 పల్లెలోని కుటుంబాలు అమ్మవారికి బోనాలు సమర్పించారు. అమ్మవారిని గ్రామంలో ఊరేగించారు. ఆలయం వద్ద పులి పార్వేటా, ఉట్టిమాను కార్యక్రమాలునిర్వహించారు. మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి అమ్మవారిని దర్శించుకున్నారు.

Updated Date - Mar 21 , 2026 | 12:11 AM