Share News

మొక్కవోని దీక్ష ఏదీ..?

ABN , Publish Date - Mar 19 , 2026 | 12:07 AM

కరువు జిల్లాను సస్యశ్యామలం చేయడానికి ప్రభుత్వం రూ. కోట్లు ఖర్చు చేస్తోంది. వర్షాలు బాగా కురవాలని.. ప్రతి వర్షపు బిందువూ భూమిలో ఇంకి.. భూగర్భ జలాలు పెంచేలా పలు కార్యక్రమాలను చేపట్టింది.

మొక్కవోని దీక్ష ఏదీ..?
కలెక్టరేట్‌లో ఎండుతున్న మొక్కలు

పుట్టపర్తి, మార్చి 18(ఆంధ్రజ్యోతి): కరువు జిల్లాను సస్యశ్యామలం చేయడానికి ప్రభుత్వం రూ. కోట్లు ఖర్చు చేస్తోంది. వర్షాలు బాగా కురవాలని.. ప్రతి వర్షపు బిందువూ భూమిలో ఇంకి.. భూగర్భ జలాలు పెంచేలా పలు కార్యక్రమాలను చేపట్టింది. ప్రతి ఊరిని ఓ నందన వనంలా చేయడానికి లక్షలాది మొక్కలను పంపిణీ చేసింది. హరితాం ధ్రప్రదేశ.., వనం - మనం, వన మహోత్సవం.. తదితర పేర్లతో మొక్క లను పంపిణీ చేసింది. వాటిని నాటి పరిరక్షించాలని అవగాహన కల్పి స్తూ విస్తృత ప్రచారం చేసింది. ప్రజలతో పాటు అధికారులు సైతం మొక్కవోని దీక్షతో మొక్కలను నాటి.. పరిరక్షిస్తామని ప్రతిజ్ఞలు చేశారు. అయితే అధికారుల నిర్లక్ష్యం వల్ల ఆ పథకం నీరుగారుతోంది. ప్రచారం ఘనంగా ఉన్నా.. అమలు మాత్రం శూన్యం. మొక్కలను పరిరక్షించడం అటుంచి.. కనీసం వాటిని నాటడంపై కూడా అధికారులు శ్రద్ధ చూపలేదు. అదేదో గ్రామీణ స్థాయి అధికారుల నిర్లక్ష్యం అనుకుంటే మీరు పొరబడినట్లే... ఏకంగా జిల్లా కేంద్రంలో నాటాల్సిన మొక్కలే.. కలెక్టరేట్‌ ఆవరణంలో ఇలా ఎండుతూ పడి ఉన్నాయి.

Updated Date - Mar 19 , 2026 | 12:07 AM