Share News

మూడు చెరువులనూ నింపుతాం : టీడీపీ

ABN , Publish Date - Jan 06 , 2026 | 11:17 PM

మండలంలోని సుబ్బరాయసాగర్‌ నుంచి పుట్లూరు, కోమటికుంట్ల, గరుగుచింతలపల్లి చెరువులను హెచ్చెల్సీ నీటితో నింపుతామని టీడీపీ మండల కన్వీనర్‌ గుత్తా శ్రీనివాసులునాయుడు స్పష్టం చేశారు

మూడు చెరువులనూ నింపుతాం : టీడీపీ
సమావేశంలో మాట్లాడుతున్న టీడీపీ నాయకులు

పుట్లూరు, జనవరి 6(ఆంధ్రజ్యోతి): మండలంలోని సుబ్బరాయసాగర్‌ నుంచి పుట్లూరు, కోమటికుంట్ల, గరుగుచింతలపల్లి చెరువులను హెచ్చెల్సీ నీటితో నింపుతామని టీడీపీ మండల కన్వీనర్‌ గుత్తా శ్రీనివాసులునాయుడు స్పష్టం చేశారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కొందరు నాయకులు పనికట్టుకొని మరీ హెచ్చెల్సీ నీరు రావంటూ ప్రచారం చేస్తున్నారని, ప్రజలు ఇలాంటి వదంతులు నమ్మరాదని కోరారు. ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ, తాడిపత్రి మున్సిపల్‌ చైర్మన జేసీ ప్రభాకర్‌రెడ్డి హెచ్చెల్సీ అధికారులతో మాట్లాడారన్నారు. వైసీపీ నాయకులకు రైతులపై ప్రేమ ఉంటే రాత్రిళ్లు కాలువపై గస్తీ నిర్వహించాలని సూచించారు. సమావేశంలో టీడీపీ నాయకులు డీసీ ఓబులనాయుడు, రామచంద్రనాయుడు పాల్గొన్నారు.

Updated Date - Jan 06 , 2026 | 11:17 PM