Share News

బొమ్మగానిపల్లిని అభివృద్ధి చేస్తాం

ABN , Publish Date - Jan 30 , 2026 | 12:12 AM

మండలంలోని బొమ్మగానిపల్లి గ్రామాన్ని కెనరా బ్యాంకు దత్తతకు తీసుకుందని, దీంతో గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని ఆ బ్యాంక్‌ మేనేజర్లు స్పష్టం చేశారు.

బొమ్మగానిపల్లిని అభివృద్ధి చేస్తాం
చెక్కు అందజేస్తున్న కెనరా బ్యాంకు మేనేజర్లు

బ్రహ్మసముద్రం, జనవరి 29 (ఆంధ్రజ్యోతి) : మండలంలోని బొమ్మగానిపల్లి గ్రామాన్ని కెనరా బ్యాంకు దత్తతకు తీసుకుందని, దీంతో గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని ఆ బ్యాంక్‌ మేనేజర్లు స్పష్టం చేశారు. అందులో భాగంగా సీఎ్‌సఆర్‌ నిధులు రూ. ఐదు లక్షలతో గ్రామంలోని పాఠశాలలో మౌలిక వసతుల కల్పిన, మరో రూ. ఐదు లక్షలతో గ్రామంలో సోలార్‌ విద్యుత దీపాలను ఏర్పాటు చేస్తున్నట్లు వారు తెలిపారు. ఈ మేరకు గురువారం ఆ గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో తిరుపతి సర్కిల్‌ హెడ్‌ జనరల్‌ మేనేజర్‌ పాండురంగ, అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌ అనంతపురం రీజనల్‌ హెడ్‌ శ్రీనివాసులు, బొమ్మగానిపల్లి బ్రాంచ మేనేజర్‌ తలారి దొణతిమ్మరాజు ఆ చెక్కును అందజేశారు. దీంతో కెనరా బ్యాం కుకు ఆ గ్రామస్థులు, గ్రామ పెద్దలు కృతజ్ఞతలు తెలిపారు. ఇందులో సర్పంచ ఆదినారాయణ రెడ్డి, మాజీ సర్పంచ తిమ్మప్ప పాల్గొన్నారు.

Updated Date - Jan 30 , 2026 | 12:13 AM