Share News

COMMISSIONER: శ్మశానవాటికల్లో సదుపాయాలు కల్పిస్తాం

ABN , Publish Date - Apr 10 , 2026 | 11:55 PM

నగరంలోని అన్ని శ్మశానవాటికల్లో సదుపాయాలు కల్పిస్తామని నగరపాలక సంస్థ కమిషనర్‌ జస్వంతరావు తెలిపారు. శుక్రవారం స్థానిక నవోదయకాలనీలో ఉన్న శ్మశానవాటికను కమిషనర్‌ పరిశీలించారు. శ్మశానవాటికలో చెత్త దిబ్బలు, ముళ్లపొదలను తొలగించాలని శానిటేషన సిబ్బందిని ఆదేశించారు.

COMMISSIONER: శ్మశానవాటికల్లో సదుపాయాలు కల్పిస్తాం
AMC Commissioner Jaswanth Rao giving instructions to the staff

అనంతపురం క్లాక్‌టవర్‌, ఏప్రిల్‌ 10(ఆంధ్రజ్యోతి): నగరంలోని అన్ని శ్మశానవాటికల్లో సదుపాయాలు కల్పిస్తామని నగరపాలక సంస్థ కమిషనర్‌ జస్వంతరావు తెలిపారు. శుక్రవారం స్థానిక నవోదయకాలనీలో ఉన్న శ్మశానవాటికను కమిషనర్‌ పరిశీలించారు. శ్మశానవాటికలో చెత్త దిబ్బలు, ముళ్లపొదలను తొలగించాలని శానిటేషన సిబ్బందిని ఆదేశించారు. లైటింగ్‌, నీటి వసతి ఏర్పాటు చేసి, మరుగుదొడ్లు నిర్మిస్తామని తెలిపారు. సదుపాయాల కల్పనకు అవసరమైన అంచనాల ప్రతిపాదనలు తయారు చేయాలని అధికారులకు సూచించారు. అనంతరం బళ్ళారి బైపాస్‌, కళ్యాణదుర్గం రోడ్డు, ప్రైఓవర్‌ జాతీయ రహదారి ప్రాంతాలను కమిషనర్‌ పరిశీలించారు. వ్యాపార సముదాయాలలో చెత్తను ఒక పద్దతిలో డంపర్‌బినలో వేయాలన్నారు. నగర సుందరీకరణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అనంతరం బళ్ళారిరోడ్డులో ఉన్న అన్నక్యాంటీనను సందర్శించిన కమిషనర్‌ అల్పాహారం పంపిణీని పరిశీలించి ఆహార నాణ్యత, సిబ్బంది సమయపాలన, వ్యవహారతీరు, పరిసరాల పరిశుభ్రతపై ఆరా తీశారు. కమిషనర్‌తో పాటు ఇంచార్జి ఎంహెచఓ నరసింహులు, ఇంజనీరింగ్‌ అధికారులు, శానిటేషన ఇనస్పెక్టర్లు, సెక్రటరీలు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 10 , 2026 | 11:55 PM