Share News

లింగ వివక్షను రూపుమాపేలా నడుం బిగించాలి

ABN , Publish Date - Apr 26 , 2026 | 12:12 AM

సమాజంలో విస్తరిస్తున్న లింగ వివక్షను రూపుమాపేలా మహిళలు నడుం బిగించాలని పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ సుబ్బలక్ష్మి పిలుపునిచ్చారు. శనివారం ప్రభుత్వ కేఎ్‌సఎన బాలికల డిగ్రీ కళాశాలలో ‘గర్భస్త శిశు లింగ నిర్ధారణ నిషేధ చట్టం’ అమలుపై అవగాహన, శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు.

లింగ వివక్షను రూపుమాపేలా నడుం బిగించాలి
Subbalakshmi speaking, doctors and officials on the stage

అనంతపురం వైద్యం, ఏప్రిల్‌ 25(ఆంధ్రజ్యోతి): సమాజంలో విస్తరిస్తున్న లింగ వివక్షను రూపుమాపేలా మహిళలు నడుం బిగించాలని పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ సుబ్బలక్ష్మి పిలుపునిచ్చారు. శనివారం ప్రభుత్వ కేఎ్‌సఎన బాలికల డిగ్రీ కళాశాలలో ‘గర్భస్త శిశు లింగ నిర్ధారణ నిషేధ చట్టం’ అమలుపై అవగాహన, శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సదస్సుకు డెమో నాగరాజు అధ్యక్షత వహించారు. పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌, వైద్య కళాశాల పేథాలజీ విభాగం డాక్టర్‌ భవాని, డ్రగ్‌ ఇనస్పెక్టర్‌ మాధవి, ఐసీడీఎస్‌ సీడీపీవో సంధ్య, రెడ్స్‌ స్వచ్ఛంద సంస్థ భానుజ, దిశ సీఐ వెంకటేశ్వర్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఆమె మాట్లాడుతూ వివక్షకు మూలమైన గర్భస్థ శిశు లింగ నిర్ధారణకు స్కానింగ్‌ సెంటర్లు కేంద్రంగా మారాయని మండిపడ్డారు. కేంద్రాలపై నిత్యం నిఘావేసి ఎక్కడిక్కడ చర్యలు తీసుకోవాల్సిన అవసరముందన్నారు. 21 సంవత్సరాలు నిండిన తరువాత వివాహం చేస్తేనే శారీరకంగా, మానసికంగా ధృడంగా ఉంటారన్నారు. డిప్యూటీ డెమో లక్ష్మీనారాయణ, హెచఈఓ గంగాధర్‌, వేణుగోపాల్‌, మానటరింగ్‌ కన్సల్టెంట్‌ ఆషారాణి, అధ్యాపకురాలు నీరజ పాల్గొన్నారు.

Updated Date - Apr 26 , 2026 | 12:12 AM