కర్బూజ ధర పతనం
ABN , Publish Date - Mar 21 , 2026 | 12:10 AM
మండలంలో జీనులకుంట, పోతవాండ్లపల్లి, కటారుపల్లి, కత్తివారిపల్లి తదితర గ్రామాల్లో రబీ సీజనలో బోర్ల కింద ఈ సారి విరివిగా కర్బూజ పంటను సాగు చేశారు.
గాండ్లపెంట, మార్చి 20(ఆంధ్రజ్యోతి): మండలంలో జీనులకుంట, పోతవాండ్లపల్లి, కటారుపల్లి, కత్తివారిపల్లి తదితర గ్రామాల్లో రబీ సీజనలో బోర్ల కింద ఈ సారి విరివిగా కర్బూజ పంటను సాగు చేశారు. అయితే ప్రస్తుతం ధరలు పడిపోవడంతో.. కనీసం పెట్టుబడులు కూడా చేతికి వచ్చే పరిస్థితి లేదు. గత సంవత్సరం క్వింటా రూ. రెండు వేలు పలకగా.. ప్రస్తుతం రూ. 400 నుంచి రూ. 500 మాత్రమే పలుకుతోంది. ఏటా రంజాన మాసం.. వేసవి మొదలయ్యే సమయం.. కర్బూజకు మంచి ధర ఉండేది. ఈసారి కూడా మంచి ధరలు వస్తాయని అనేక మంది ఈ పంట మొగ్గు చూపారు. జనవరిలో సాగు చేసిన ఈ పంటకు అధికంగా చీడపీడలు పట్టాయి. అంతేకాకుండా తమిళనాడులోనూ ఈ పంటను విస్తారంగా సాగు చేయడం.. అక్కడ మంచి దిగుబడులు... నాణ్యత ఉండటంతో మార్కెట్‌లో ఆ పంటకు మంచి డిమాండ్ ఏర్పడింది. ఇక్కడి పంట ఆశించిన ధర రాలేదు.