Share News

జోరుగా వ్యవసాయ పనులు

ABN , Publish Date - Jan 24 , 2026 | 12:13 AM

మండలంలోని బీటీపీ ఎడమ కాలవ కింద వరిసాగు పనులు జోరుగా సాగుతున్నాయి. పదేళ్లుగా సాగునీరు అందక బీడుపడిన ఆయకట్టు భూములకు సాగునీరు అందడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

జోరుగా వ్యవసాయ పనులు
వ్యవసాయ పనుల్లో రైతులు

గుమ్మఘట్ట, జనవరి 23(ఆంధ్రజ్యోతి): మండలంలోని బీటీపీ ఎడమ కాలవ కింద వరిసాగు పనులు జోరుగా సాగుతున్నాయి. పదేళ్లుగా సాగునీరు అందక బీడుపడిన ఆయకట్టు భూములకు సాగునీరు అందడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ట్రాక్టర్లతో పొలాలను దుక్కి చేస్తూ వరిపంట సాగుకు సన్నద్ధమయ్యారు. ఎడమ కాలువ కింద నాలుగువేల ఎకరాలకు సాగునీరు అందడంతో గుమ్మఘట్ట, బీటీపీ, గోనబావి, కలుగోడు గ్రామాల రైతులు పొలం పనుల్లో బిజీగా ఉన్నారు.

Updated Date - Jan 24 , 2026 | 12:13 AM