జాతీయ వేదికపై వజ్రకరూరు సర్పంచ గళం
ABN , Publish Date - Jan 20 , 2026 | 11:39 PM
వజ్రకరూరు సర్పంచ మోనాలిసా జాతీయ గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, ఫౌండేషన ఫర్ ఎకాలజీ సెక్యూరిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన చర్చావేదికలో గళం వినిపించారు.
వజ్రకరూరు(ఉరవకొండ), జనవరి 20(ఆంధ్రజ్యోతి): వజ్రకరూరు సర్పంచ మోనాలిసా జాతీయ గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, ఫౌండేషన ఫర్ ఎకాలజీ సెక్యూరిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన చర్చావేదికలో గళం వినిపించారు. హైదరాబాద్‌లోని పంచాయతీరాజ్ కార్యాలయంలో ‘సామూహిక వనరుల సంరక్షణ’ అనే అంశంపై మంగళవారం జాతీయస్థాయి చర్చా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏపీ నుంచి వజ్రకరూరు సర్పంచ మాత్రమే ఎంపికయ్యారు. సామూహిక వనరులను ఎలా కాపాడాలి, గ్రామాల్లో ప్రభుత్వ స్థలాలు ఆక్రమణకు గురైతే వాటిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశాలపై ప్రసంగించారు. మూడు రోజులపాటు ఈ చర్చా వేదిక ఉంటుందని ఆమె తెలిపారు.