Share News

ఆటో డ్రైవర్లకు యూనిఫాం పంపిణీ

ABN , Publish Date - Jan 30 , 2026 | 12:15 AM

పట్టణంలోని ఆటో డ్రైవర్లకు ఉచిత వైద్యశిబిరం, కంటి పరీక్షల శిబిరాన్ని స్థానిక హైస్కూల్‌ ప్రాంగణంలో గురువారం నిర్వహించారు.

ఆటో డ్రైవర్లకు యూనిఫాం పంపిణీ

రాయదుర్గంరూరల్‌, జనవరి 29(ఆంధ్రజ్యోతి): పట్టణంలోని ఆటో డ్రైవర్లకు ఉచిత వైద్యశిబిరం, కంటి పరీక్షల శిబిరాన్ని స్థానిక హైస్కూల్‌ ప్రాంగణంలో గురువారం నిర్వహించారు. రాయదుర్గం సీఐ జయనాయక్‌ సుమారు 100 మంది ఆటో డ్రైవర్లకు ఖాకీ యూనిఫాంలను పంపిణీ చేశారు. రోడ్డు నియమాలపై అవగాహన కల్పించారు. ఇందులో మార్కెట్‌యార్డ్‌ ఛైర్మన హనుమంతరెడ్డి, టీడీపీ పట్టణ అధ్యక్షుడు బండి కృష్ణమూర్తి, మండల కన్వీనర్‌ కురుబ హనుమంతు పాల్గొన్నారు.

Updated Date - Jan 30 , 2026 | 12:15 AM