ఏటీఎంలో చినిగిన నోట్లు
ABN , Publish Date - Jan 26 , 2026 | 12:38 AM
స్థానిక తిలక్‌నగర్‌కు చెందిన కే హరిప్రసాద్ హనుమేష్ నగర్‌లోని పాత టీవీఎస్ షోరూం ఎదురుగా ఉన్న ఓ ఏటీఎంలో ఆదివారం మధ్యాహ్నం డబ్బులు డ్రా చేశారు.
గుంతకల్లుటౌన, జనవరి 25(ఆంధ్రజ్యోతి): స్థానిక తిలక్‌నగర్‌కు చెందిన కే హరిప్రసాద్ హనుమేష్ నగర్‌లోని పాత టీవీఎస్ షోరూం ఎదురుగా ఉన్న ఓ ఏటీఎంలో ఆదివారం మధ్యాహ్నం డబ్బులు డ్రా చేశారు. ఏటీఎంలో రూ. 6 వేలు డ్రా చేయగా.. రూ. 500 నోట్లు ఎనిమిది నోట్లు చినిగిపోయినవి, కాలిపోయిన, ప్లాస్టర్ అట్టించిన నోట్లు రావడంతో అవాక్కయ్యాడు. ఇటీవల ఏటీఎం ద్వారా ఇలా చినిగిపోయిన నోట్లు వస్తున్నాయని ఖాతాదారులు వాపోతున్నారు.