వైభవంగా భావనారుషీంద్రుల కల్యాణం
ABN , Publish Date - Jan 23 , 2026 | 11:58 PM
స్థానిక మార్కండేయస్వామి ఆలయంలో భద్రావతి, భావనారుషీంద్రుల కల్యాణోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు.
ఉరవకొండ, జనవరి 23(ఆంధ్రజ్యోతి): స్థానిక మార్కండేయస్వామి ఆలయంలో భద్రావతి, భావనారుషీంద్రుల కల్యాణోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఆలయంలో స్వామి వారి మూలవిరాట్‌కు ప్రత్యేక అభిషేకాలు, పూజలు, హోమాలు చేశారు. అనంతరం భద్రావతి, భావనారుషీంద్రుల ఉత్సవమూర్తులతో కల్యాణోత్సవాన్ని నిర్వహించారు. ఉత్సవమూర్తులను ఊరేగించారు.