Share News

ప్రజాసమస్యలపై అదే నిర్లక్ష్యం

ABN , Publish Date - Jan 19 , 2026 | 11:42 PM

ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ప్రతి సోమవారం పీజీఆర్‌ఎస్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.

ప్రజాసమస్యలపై అదే నిర్లక్ష్యం
ఫిర్యాదులు స్వీకరిస్తున్న డీటీ

గుంతకల్లు టౌన, జనవరి 19 (ఆంధ్రజ్యోతి): ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ప్రతి సోమవారం పీజీఆర్‌ఎస్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ప్రభుత్వ లక్ష్యం గొప్పగానే ఉన్నా... అధికారుల నిర్లక్ష్యం వల్ల అది నీరుగారిపోతోంది. వారానికి ఒక్కపూట కూడా అధికారులు ప్రజా సమస్యలు వినడానికి సమయాన్ని కేటాయించడం లేదు. స్ధానిక తహసీల్దార్‌ కార్యాలయంలో నిర్వహించే ఈ కార్యక్రమానికి సగానికి పైగా అధికారులు గైర్హాజరవుతూనే ఉన్నారు. ఉన్నతాధికారులు వారిపై ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడంతో.. గైర్హాజర్‌ అవుతున్న వారి సంఖ్య వారం.. వారం.. పెరుగుతోంది. ఈ సోమవారం డిప్యూటీ తహసీల్దార్‌ నారాయణస్వామి ఆఽధ్యక్షన నిర్వహించిన పీజీఆర్‌ఎ్‌సకు 27 శాఖలకుగాను 11 శాఖలకు చెందిన అధికారులు మాత్రమే హాజరయ్యారు. వారిలోనూ కొందరు సంతకాలు పెట్టి వెళ్లిపోగా.. మరికొందరు సెల్‌ఫోన్లతో కాలక్షేపం చేసి వెళ్లిపోయారు. ప్రతి సోమవారం ఇదే పరిస్థితి.

Updated Date - Jan 19 , 2026 | 11:42 PM