వైభవంగా పంచమ జ్యోతుల ఉత్సవం
ABN , Publish Date - Jan 16 , 2026 | 11:48 PM
స్థానిక చౌడేశ్వరిదేవి పంచమ జ్యో తుల ఉత్సవాలను గురువారం వైభవంగా నిర్వహించారు.
ఉరవకొండ, జనవరి 16(ఆంధ్రజ్యోతి): స్థానిక చౌడేశ్వరిదేవి పంచమ జ్యో తుల ఉత్సవాలను గురువారం వైభవంగా నిర్వహించారు. ఐదేళ్లకు ఒక్కసారి తొగట వీరక్షత్రియ, దేవాంగ ఆధ్వర్యంలో వేర్వేరుగా ఈ జ్యోతుల నిర్వహించడం ఆనవాయితీ. ఉదయం గంగా జలాన్ని ఊరేగింపుగా తీసుకెళ్లారు. సంప్రదాయ నృత్యాలు, డప్పులు వాయిద్యాలు ఆకట్టుకున్నా యి. అనంతరం అర్ధరాత్రి పంచమజ్యోతులను ఊరేగించారు.