Share News

కరువు రహిత జిల్లాయే లక్ష్యం

ABN , Publish Date - Mar 16 , 2026 | 12:26 AM

శ్రీసత్యసాయి జిల్లాను... కరువు రహితంగా మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తోందని కలెక్టర్‌ శ్యామ్‌ప్రసాద్‌ పేర్కొన్నారు.

కరువు రహిత జిల్లాయే లక్ష్యం
పనులు ప్రారంభిస్తున్న కలెక్టర్‌, ఎమ్మెల్యే

కదిరి, మార్చి 15(ఆంధ్రజ్యోతి): శ్రీసత్యసాయి జిల్లాను... కరువు రహితంగా మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తోందని కలెక్టర్‌ శ్యామ్‌ప్రసాద్‌ పేర్కొన్నారు. ఆదివారం యర్రదొడ్డిలో మనపల్లె - మన నీరు కార్యక్రమంలో భాగంగా కాళసముద్ర కాలువ పనులను కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌తో కలిసి ప్రారంభించిన కలెక్టర్‌ మాట్లాడారు. ఈ పథకం ద్వారా చెరువులో పూడీకతీత, కాలువను శుభ్రం చేసి.. మరమ్మతులు చేస్తామన్నారు. జిల్లాలో 14 మీటర్ల లోతులో భూగర్భజలాలున్నాయని, జిల్లాలో 1100 పైగా చెరువులున్నాయని, వాటిని త్వరలో నింపితో నీటి మట్టం పెంచేలా చర్యలు తీసుకుంటామన్నారు. నియోజకవర్గంలో అన్ని చెరువుల్లో పూడీక తీయడానికి ఒక ఎక్స్‌కవేటర్‌ను ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేని కోరితే.. ఆయన మండలాలకు ఆరు ఎక్స్‌కవేటర్లను ఏర్పాటు చేస్తామని చెప్పడం హర్షించదగ్గ విషయమన్నారు. 90 రోజుల పాటు ఈ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. హంద్రీనీవా ద్వారా 40 టీఎంసీల నీటిని వాడుకున్నామని, ఇది ఓ పెద్దరికార్డు అని , ప్రభుత్వం 50 టీఎంసీల వరకు వాడుకోవాలని చెబుతుతోందని అన్నారు. రాబోయే కాలంలో చెరువులన్ని నింపి, సాగు, తాగునీటికి ఇబ్బందులు లేకుండా చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో వీవీఎస్‌ శర్మ, ఇరిగేషన అధికారులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Mar 16 , 2026 | 12:26 AM