గేటు సమస్య కొలిక్కి
ABN , Publish Date - Jan 08 , 2026 | 12:25 AM
స్థానిక ధర్మవరం గేటు వద్ద ట్రాఫిక్ సమస్య ఎట్టకేలకు తీరనుంది. గుంతకల్లు పట్టణానికి మూడు వైపులా రైల్వే గేట్లు, ఇరుకైన రైలు వంతె లు ఉండటంతో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంటోంది.
గుంతకల్లు, జనవరి 7 (ఆంధ్రజ్యోతి): స్థానిక ధర్మవరం గేటు వద్ద ట్రాఫిక్ సమస్య ఎట్టకేలకు తీరనుంది. గుంతకల్లు పట్టణానికి మూడు వైపులా రైల్వే గేట్లు, ఇరుకైన రైలు వంతె లు ఉండటంతో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంటోంది. అంతేకాకుండా ఒకసారి గేటు వేశారంటే దాదాపు 20 నిమిషాల దాకా గేటు తెరుచుకోదు. వెంటవెంటనే రెండు రైళ్లు వ చ్చాయంటే ఇక చెప్పాల్సిన పనిలేదు. ధర్మవరం గేటును తొలగించి అక్కడ ఆర్‌యూబీని నిర్మించేందుకు పన్నెండేళ్లుగా రాజకీయ నాయకులు, అధికారులు కృషి చేస్తున్నా ప్ర యత్నాలు ఫలించలేదు. టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ రైల్వే అధికారులతో మంతనాలు జరిపి ఆర్‌యూబీ నిర్మాణానికి ఒప్పించారు. అ లాగే నిర్వాసితులకు పరిహారాలను చెల్లించడానికి పురపాలక సంఘం డబ్బు చెల్లించేలా ప్రభుత్వం నుంచి అనుమతులు తెచ్చారు.
రూ. 4.10 కోట్లతో కార్యాచరణ: ధర్మవరం రైల్వే లెవెల్ క్రాసింగ్ గేటును తొలగించి ఆర్‌యూబీని నిర్మించేందుకు అవసరమయ్యే ప్రైవేటు స్థలాల సేకరణ, తాగునీటి పైప్‌లైన షిఫ్టింగ్ కోసం రూ. 4.10 కోట్లు సమకూర్చాల్సి వచ్చింది. ఇందుకుగానూ రైల్వేశాఖ రూ. 1.80 కోట్లు ఇవ్వగా, పురపాలక సంఘం నుంచి రూ. 2.30 కోట్ల నిధులు ఇవ్వడానికి నిర్ణయించారు. రైల్వే శాఖ నిర్ణీత సొమ్మును చెల్లించగా, ధర్మవరం గేటు వద్ద ఉన్న పైప్‌లైనను రూ. 95 లక్షలతో గత సంవత్సరంలో మరో మార్గం గుండా మళ్లించారు. అలాగే 15 మంది నిర్వాసితులకు రూ. 3.15 కోట్ల పరిహారాలను ఇవ్వడానికి రంగం సిద్ధం చేశారు. దీంతో ధర్మవరం గేటును తొలగించి సమీపంలో రోడ్ అండర్ బ్రిడ్జిని నిర్మించనున్నారు. ఇందుకోసం రైల్వే శాఖ తన నిధులతో టెండర్లను నిర్వహించింది. వంతెన పనులు చేయడానికి అనుకూలంగా గుంతబావి వద్ద మునిసిపల్ అధికారులు ఈ నెల రెండో తేదీ నుంచి ఆ రాస్తాను మూసేశారు. అతి త్వరలో ఆర్‌యూబీని నిర్మించేందుకు రైల్వే అధికారులు చర్యలు చేపట్టనున్నారు.