వీడిన గ్రహణం
ABN , Publish Date - Jan 19 , 2026 | 12:08 AM
గత వైసీపీ ప్రభుత్వం మండలంలో పది ప్రభుత్వ పాఠశాలలో నాడు - నేడు పథకం కింద పనులు చేపట్టింది. కొన్ని స్కూళ్లల్లో ఉన్న భవనాలను కూల్చి.. కొత్తగా నిర్మాణాలు చేపట్టింది.
డీ.హీరేహాళ్, జనవరి18(ఆంధ్రజ్యోతి): గత వైసీపీ ప్రభుత్వం మండలంలో పది ప్రభుత్వ పాఠశాలలో నాడు - నేడు పథకం కింద పనులు చేపట్టింది. కొన్ని స్కూళ్లల్లో ఉన్న భవనాలను కూల్చి.. కొత్తగా నిర్మాణాలు చేపట్టింది. అయితే నిధులు మంజూరు చేయకపోవడంతో ఆ పనులు ఆగిపోయాయి. దీంతో ఉపాధ్యాయులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయినా వైసీపీ ప్రభుత్వం కాలయాపన చేసింది. చాలా పాఠశాలల్లో ఒకే తరగతి గదిలో రెండు, మూడు తరగతులను నిర్వహిస్తున్నారు. చెట్ల కింద కూడా తరగతులను నిర్వహించే పరిస్థితులు ఉన్నాయి. మండలకేంద్రంలోని జిల్లా పరిషత ఉన్నత పాఠశాల, పులకుర్తి, నాగలాపురం తదితర జిల్లా పరిషత ఉన్నత పాఠశాల భవన నిర్మాణాలు పునాదులకే పరిమితమయ్యాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే.. ఆ భవన నిర్మాణాలు పూర్తిచేసేలా చర్యలు చేపట్టింది. ఇప్పటికే 80 శాతం మేర నిర్మాణ పనులు పూర్తయ్యాయి. మరో నెలలో నిర్మాణాలు పూర్తయ్యే అవకాశముంది.