Share News

గడ్డపార పట్టిన కలెక్టర్‌

ABN , Publish Date - Feb 28 , 2026 | 12:07 AM

కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌.. గడ్డపార పట్టి, ఉపాధి పనులు చేశారు. మండలంలోని వేములేటిపల్లి సమీపాన జరుగుతున్న ఉపాధి పనులను ఆయన శుక్రవారం పరిశీలించారు

గడ్డపార పట్టిన కలెక్టర్‌
ఉపాధి పనులు చేస్తున్న కలెక్టర్‌

కొత్తచెరువు, ఫిబ్రవరి 27(ఆంధ్రజ్యోతి): కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌.. గడ్డపార పట్టి, ఉపాధి పనులు చేశారు. మండలంలోని వేములేటిపల్లి సమీపాన జరుగుతున్న ఉపాధి పనులను ఆయన శుక్రవారం పరిశీలించారు. ఫీడర్‌ చానల్‌ పనులను తనిఖీ చేశారు. కలెక్టర్‌ గడ్డపార పట్టి, తవ్వారు. నీటి సంరక్షణ పనులకు ప్రాధాన్యమివ్వాలని సూచించారు. కార్యక్రమంలో ఏపీడీ రమేశబాబు, ఎంపీడీఓ నటరాజ్‌, ఇరిగేషన జేఈ జమునాబాయి పాల్గొన్నారు.

Updated Date - Feb 28 , 2026 | 12:07 AM