దివ్యాంగ శక్తికి శ్రీకారం
ABN , Publish Date - Mar 19 , 2026 | 12:04 AM
దివ్యాం గ శక్తి పథకాన్ని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత స్థానిక ఆర్టీసీ డిపోలో బుధవారం ప్రారంభించారు.
ధర్మవరం, మార్చి 18(ఆంధ్రజ్యోతి): దివ్యాం గ శక్తి పథకాన్ని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత స్థానిక ఆర్టీసీ డిపోలో బుధవారం ప్రారంభించారు. దివ్యాంగులకు బస్సు పాసులను అందజేశారు. దివ్యాంగులు ప్రయాణించే బస్సును ప్రారంభించారు. అనంతరం వారితో కలిసి ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేశారు. జీరో ఫేర్ టికెట్‌ను దివ్యాంగులకు అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దివ్యాంగులు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని, వారికి ఇచ్చే పింఛనను రూ.3వేలు నుంచి రూ.6 వేలకు పెంచిందని, గతంలో 50 శాతం మాత్రమే ఆర్టీసీ బస్సులో రాయితీ ఉండేదని, ఇప్పుడు పూర్తీగా ఉచితమని తెలిపారు. కార్యక్రమంలో ఆర్టీసీ డిపో మేనేజర్ సత్యనారాయణ, టీడీపీ నాయకులు కమతం కాటమయ్య, ఫణికుమార్, పరిశే సుధాకర్, సందారాఘవ, భీమనేని ప్రసాద్‌నాయుడు, చింతపులుపు పెద్దన్న, పురుషోత్తంగౌడ్, నాగూర్ హుస్సేన, రాళ్లపల్లి షరీప్, జింకా పురుషోత్తం, మాధవరెడ్డి, జింకల రాజన్న, బొట్టుకిష్ట, కేశగాళ్లశీన, చీమల రామాంజి, కరెంటు ఆది, డిష్ లచ్చి, పల్లపు రవీంద్ర, తోట నారాయణస్వామి పాల్గొన్నారు.