చెట్లు, నీటితోనే మనుగడ
ABN , Publish Date - Apr 16 , 2026 | 12:46 AM
చెట్లు నాటి వాటిని పెంచడం.. నీటిని వృథా చేయకుండా పొదుపుగా వాడుకోవడం పైనే అందరి భవిష్యత ఉంటుందని విశాఖపట్నంకు చెందిన యువ కుడు రాముఆచార్య అభిప్రా యపడ్డారు.
నంబులపూలకుంట, ఏప్రిల్ 15(ఆంధ్రజ్యోతి): చెట్లు నాటి వాటిని పెంచడం.. నీటిని వృథా చేయకుండా పొదుపుగా వాడుకోవడం పైనే అందరి భవిష్యత ఉంటుందని విశాఖపట్నంకు చెందిన యువ కుడు రాముఆచార్య అభిప్రా యపడ్డారు. వీటిపై అవగాహన కల్పిస్తూ దేశంలోని 28 రాష్ట్రా ల్లో సైకిల్ పర్యటిస్తూ అవగా హన కల్పిస్తున్నట్లు తెలిపారు. రాముఆచార్య బుధవారం అన్నమయ్య జిల్లా గాలివీడు నుంచి కదిరికి సైకిల్‌పై వెళ్తూ.. మార్గమధ్యలో ఎన్పీకుంటలో ప్రజలకు అవగాహన కల్పిం చారు. అనంతరం అతను ఆంధ్రజ్యోతితో మాట్లాడారు. తాను విశాఖపట్నంలోని ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి వరకు చదువుకున్నానని, చదువుకునే రోజుల్లోనే చెట్లు, నీటిని రక్షించే ఆలోచన వచ్చిందని తెలిపారు.దీనిపై దేశ వ్యాప్తంగా సైకిల్‌పై తిరుగుతూ ప్రజలకు అవగాహన కల్పించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. దీనికి తల్లిదండ్రులు నారాయణరావు, దీపాను ఒప్పించానన్నారు. తాను చదువుకుంటున్న సమయంలో రూ.2.50 లక్షలను పొదుపు చేసుకున్నానని, ఆ సోమ్ముతోనే దేశమంతా సైకిల్‌యాత్ర చేస్తున్నానని తెలిపారు. చెట్లు నరకకూడదని, భావితరాలకు ఇబ్బంది కలుగుతుందని, ప్రతి ఒకరూ చెట్లు నాటాలన్న లక్ష్యంతో దేశమంతా చెట్టు నాటే కార్యక్రమాన్ని 2022 లో అక్టోబరు 6న మొదలు చేపట్టానన్నారు. ఇప్పటివరకు ఇప్పటివరకు 51వేల కిలోమీటర్లు ప్రయాణం చేశానని, 26 రాష్ట్రాల్లో తన పర్యటన పూర్తి అయిందని, ఇక ఏపీ, తెలంగాణలో పర్యటిస్తే తన యాత్ర పూర్తి అవుతుందని తెలిపారు.